తల్లితండ్రులు పిల్లలతో ఎప్పుడు చెప్పకూడని 5 విషయాలు : పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇవే ప్రధానం..

పిల్లల భవిష్యత్ తల్లితండ్రుల పెంపకం, వారు చెప్పే మాటలు, వారు  అనుసరించే పద్ధుతులపైనే ఆధారపడి ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి ఏది కావాలని కోరుకుంటారో ముందు అది ఇచ్చే పద్ధితిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మీ పిల్లలతో మీరు ఎప్పుడు ఈ 5 విషయాలను చెప్పకూడదు. అవేంటో తెలుసుకుని అందరికీ SHARE చేయడం మాత్రం మర్చిపోకండి. 

భయ పెట్టకూడదు

చిన్నప్పుడు చిన్నపిల్లలను బుజ్జగించడానికి, మారాం చేస్తుంటే, అల్లరి చేస్తుంటే భయపెట్టాలని చూస్తుంటారు చాలామంది  తల్లితండ్రులు. పిల్లలు చిన్నతనంలో ఏం చేసినా సరే భయపెట్టకూడదు. ఈ భయమే పెరిగేకొద్దీ వారిలో బలంగా ఉండిపోయి ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా సరే భయపడుతూనే ఉంటారు.

బెదిరించడం

చేసేపని తప్పో? ఒప్పో? అని తెలియని వయసులో ఇలా చేస్తే కొడతాను, అలా చేస్తే పాడవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది అంటూ ప్రతి చిన్న విషయానికి పిల్లలను బెదిరించడం వలన ఏ పని చేయాలన్నా అమ్మ ఏమంటుందో, నాన్న ఏమంటారో అని భయంతో బెదిరిపోతుంటారు కానీ తమ ఇష్ట ప్రకారం, ఆలోచనల ప్రకారం ఏమి చేయలేరు.

సిగ్గు ఉండకుండా చూడాలి

చిన్న వయస్సులో అలవాటైనవే పెద్దయ్యాక కూడా అలాగే ఉంటాయి కాబట్టి కొందరు పిల్లలు అందరితో కలిసి పోవడానికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అందుకని సిగ్గును దూరం చేయాలి. లేకపోతే మీతో మాట్లాడటానికి కూడా సిగ్గుతో అలానే ఉండిపోతారు.

నిరుత్సాహ పరచకూడదు

నువ్వు ఎందుకు పనికిరావు, ఆ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, నీ వల్ల ఏమీ కాదు అని చిన్నతనం నుండే వారిని నిరుత్సాహపరిచేలా అస్సలు మాట్లాడకూడదు. ఇలా చేయడం వలన జీవితంలో నేనేం సాధించలేను, నా జీవితం ఇంతే అనే భ్రమలోపడి పోతారు. ఆ తర్వాతే మీరే బాధపడాల్సి వస్తుంది.

సాయం చేయడం

ఈ విషయం ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ పరిస్థితిని బట్టి వారి మనస్సుకే తెలుస్తుంది. అయితే ఎవరికీ సాయం చేయకు, ఇక్కడ అందరూ స్వార్థ పరులే, ఎవరినీ నమ్మకు, నీ స్వార్థం నువ్వు చూసుకో అనే మాటలు చెప్పడం వలన వారికి జీవితంలో ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు.

ఈ విషయాలు మీ పిల్లలకు ఎవరూ చెప్పరు. కానీ మీ పిల్లల భవిష్యత్ బంగారుబాట కావాలనే సదుద్దేశ్యంతోనే ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది.  ఇవి నిజమే అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీలో మీ ఆయనకు నచ్చిన 6 విషయాలు…కానీ ఎప్పుడు చెప్పడు

Leave a Reply

%d bloggers like this: