బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పిల్లల బరువు పెంచవచ్చా? తప్పకుండా. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, తల్లి పాలలో కొవ్వు శాతం బిడ్డ బరువు పెరగడానికి సహాయపడుతుంది. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తప్పకుండా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..
1. పాలు

పాల పదార్ధాలలో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అధిక ప్రోటీన్లు కూడా ఉంటాయి. పాలు తీసుకోవడం వలన కండరాలు విస్తరిస్తాయి. రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవడం మంచిది.
2. నెయ్యి

ఇంట్లో తయారుచేసుకునే నెయ్యిలో, పిల్లల మెదడు ఎదుగుదలకు కావాల్సిన DHA అధికంగా ఉంటుంది. ఏది తల్లి పాల నాణ్యతను పెంచుతుంది. బరువు పెరుగుతారు అనే భయంతో నెయ్యి తీసుకోకుండా ఉండకండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత బరువు తగ్గడానికి జాగ్రత్తులు తీసుకోవచ్చు.
3. అరటిపండు

ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే, అరటి పండు మీ పిల్లల బరువు పెంచడానికి చాలా ఉపయోగపడుతాయి. అరటిపండులో అధికంగా ఉండే పోషకాలు మీ పాల ద్వారా పిల్లలకు చేరుతాయి. అందుకే రోజుకు 2-3 అరటిపండ్లు తినండి.
4. తృణ ధాన్యాలు (Whole grains)
గోధుమలు, జొన్న, ఓట్స్, రాగి లాంటి తృణ ధాన్యాలలో కార్భోహైడ్రేట్స్, క్యాలోరిస్ అధికంగా ఉంటాయి. పాల ద్వారా మీ పిల్లల బరువు పెంచడానికి ఇవి ఒక చక్కని ఆహరం. పీచు పదార్ధాలు అధికంగా ఉండడం వలన సులువుగా అరుగుతాయి.
5. డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో క్యాలోరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు క్యాలోరీలను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నాన పెట్టిన బాదం, పిస్తా, ఖర్జురం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, ఆప్రికాట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
6. చికెన్

బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో స్కిన్ తో కూడిన చికెన్ తినండి. చికెన్ స్కిన్ లో ప్రోటీన్లు, క్యాలోరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మీ పాల ద్వార పిల్లలకు చేరుకుంటె వారి కండరాల ఎదుగుదలకు తోడ్పడుతాయి. అయితే చికెన్ లో మసాలాలు ఎక్కువగా
7. గుడ్లు

మీ పాలలో పోషకాలు పెరగాలంటే మీరు తప్పకుండా తినాల్సిన అహ్హరం గుడ్లు. రోజుకు రెండు గుడ్లు పూర్తిగా తినండి. ఇవి మీ పిల్లల బరువు పెంచడానికి సహాయపడుతాయి.
8.ఆకు కూరలు – కూరగాయలు

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. వీటిలో ఉండే పీచు పదార్ధాలు మీరు తీసుకునే కొవ్వులను సులువుగా అరిగిస్తాయి. అందుకే పాలకూర, మెంతి కూర, చుక్కాకు ఇంకా మిగతా ఆకుకూరలు కూడా తీసుకోండి.
రొమ్ముల్లో పాల ఉత్పత్తి పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారాలు:

1. మెంతులు
2. సోంపు
3. వెల్లులి
4. పచ్చి కొబ్బరి
5. నువ్వులు
6. సొరకాయ
పాల ఉత్పత్తిని పెంచే ఇలాంటి ఆహారాలను గాలాక్టోగోగ్స్ (Galactogougues) అంటారు.