త్వరగా గర్భం దాల్చి, పిల్లలు పుట్టాలంటే ఈ 3 ఆహారాలు తప్పనిసరి

మీ ఆరోగ్యం మీరు తినే ఆహరం మీద ఆధారపడివుంటుంది అన్నది అందరికి తెలిసిన రహస్యమే. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ సంతాన సాఫల్యత కుడా మీరు తినే ఆహరం మీద ఆధారపడివుంటుంది. మీరు ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహరం మిమ్మల్ని త్వరగా ప్రేగ్నన్ట్ చేస్తాయి. మీరు ప్రెగ్నన్సీ కోసం ప్లాన్  చేసుకుంటున్నట్లైతే, ఈ వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి… 

1. బీన్స్

బీన్స్, ప్రోటీన్లు, పీచు పదార్ధాలతో పాటు కాల్షియమ్, ఐరన్, పొటాషియం లాంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ సంతానోత్పత్తి శక్తిని పెంచుతాయి. వీటిలో అధికంగా ఉండే బి విటమిన్, మీ ఫోలేట్ ను అందిస్తాయి. ఇవి మగవాళ్ళలో, ఆడవాళ్ళలో పునరుత్పత్తి అవకాశాలను మెరుగుపరుస్తాయి.  పిల్లలకు పుట్టుకతో కలిగే మెదడు సమస్యలను నివారిస్తుంది. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది, సులువుగా అరుగుతుంది.

2. గింజలు మరియు విత్తనాలు

సంతానోత్పత్తి ఆహారలలో గింజలు విత్తనాలు ప్రధానమైనవి. వీటిలో ప్రోటీన్లు శరీర కణజాల నిర్మాణానికి సహాయపడుతాయి. ఇవి గర్భంలోని పిండ ఎదుగుదలకు కావాల్సిన నిర్మాణాన్ని అందిస్తాయి. నువ్వులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఋతుక్రమాన్ని సరళీకరిస్తుంది. మీరు గర్భం ధరించే అవకాశాన్ని పెంచుతాయి.

3. అవకాడో

అవకాడో లో ఉంటె ఫోలేట్, B6 విటమిన్ పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. శరీరంలో చెడు క్రొవ్వులను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. వీటిలో వుండే పీచు పదార్ధాలు, అరుగుదల శక్తిని పెంచి రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గిస్తాయి. ఇలా మీ శరీరంలోని సంతాన సాఫల్యతను అభివృద్ధి చేస్తుంది.  ఈ మధ్య అన్ని సూపర్ మర్కెట్స్ లో ఈ అవకాడో దొరుకుతుంది, తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి.  

Leave a Reply

%d bloggers like this: