పిల్లలు పుట్టకుండా చేసే ఫైబ్రాయిడ్స్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు

ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి?

గర్భాశయంలో ఏర్పడే కణతులనే ఫైబ్రాయిడ్స్ అని అంటారు. గర్భాశయంలో ఒక్కొక్కటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా  ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా 30 నుండి 50 ఏళ్ళ మధ్య స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణాలు?

ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణాలు ఏంటి అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తక్కువ వయసులోనే నెలసరులు ప్రారంభం కావడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత (హెచ్చుతగ్గులు), ఋతుచక్రం మరియు గర్భధారణ సమయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతుంటాయి. అలాగే స్థూలకాయం, సంతానం లేకపోవడం, అంతకుముందు మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే గర్భాశయంలో కణితులు రావడానికి కారణం.

ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి

ఫైబ్రాయిడ్స్ ఉండే ప్రదేశం, సైజును బట్టి లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ముఖ్యంగా  నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు, అధిక రక్తస్రావం, మూత్రాశయంపై వీటి ఒత్తిడి పడినట్లయితే తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తుండటం, తీవ్రమైన కడుపునొప్పి, పొత్తి కడుపులో నొప్పి, రెండు ఋతుచక్రాల మధ్య ఎక్కువ సమయం పట్టడం, మూత్రం ఆగిపోవడం, వాసన కలగడం, దురద పెట్టడం, గర్భం రాకపోవడం వలన సంతానలేమి సమస్యలు, గర్భం వచ్చినా కొన్నిసార్లు అబార్షన్స్ జరగడం, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం ఫైబ్రాయిడ్స్ ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు.

ఫైబ్రాయిడ్స్ రకాలు

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరిగే ప్రదేశం మరియు ఉండే ప్రదేశాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటాయి.

సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్

ఇవి గర్భాశయం లోపల కింద ఉండే మ్యూకోసల్ పొరలో ఏర్పడుతాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా తక్కువ శాతమే స్త్రీలలో వస్తుంటాయి. అయితే రక్తస్రావం ఎక్కువగా ఉండటం, కొన్నిసార్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతాయి.

సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్స్

ఇవి సాధారణంగా గర్భాశయం లోపల పొరలో ఏర్పడి మెల్లగా గర్భాశయం వెలుపలికి వస్తుంటాయి. ఇవి మెలితిరిగినప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్

గర్భాశయంలోని మాయోమెట్రియమ్ అనే పొరలో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువమంది మహిళలలో వస్తుంటాయి. వీటి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఫైబ్రాయిడ్స్ చికిత్స

సహజంగా ఫైబ్రాయిడ్స్ నుండి బయటపడాలంటే ఫ్యాట్ తక్కువగా ఉండే డైరీ ప్రాడక్ట్స్ తినడం, క్రమం తప్పకుండా ఉసిరిని తేనెతో కలిపి తీసుకోవడం, రోజుకి రెండు లేదా వెల్లుల్లి తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణం హార్మోన్ల అసమతుల్యత కాబట్టి వీటిని ప్రస్తుత వైద్యవిధానం ద్వారా సమతుల్యత చేయడం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

 ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ ఫీడింగ్: పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: