ప్రెగ్నెన్సీ సమయంలో ఈ 8 విషయాలు మీకు దూరమవుతాయి. అంతా మీ మంచికే..

ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఆనందకరమైన విషయం. దీనిని ఒక తల్లిగా మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు. మీకు ప్రెగ్నెన్సీ రాగానే మీ శరీరంలో,  మీ పరిసరాలలో చాలా మార్పులు వస్తాయి. మీరు ప్రెగ్నెన్సీ సమయంలో కొన్నింటిని మిస్ అవుతారు. అవేంటంటే,

నవ్వులు

మీరు బాధాకరమైన ముఖాలకు దూరం అవుతారు. మీతో ఎవరు మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడుతారు. దీంతో మీకు తెలియకుండానే మీరు ఒక ఆశావహ దృక్పథంతో ఉంటారు.

అందరి దృష్టి

మీరు కడుపులో బేబీని మోస్తున్నప్పుడు అందరి దృష్టీ మీపైన ఉంటుంది. మీతో చాలా మంది పరిచయం లేని వాళ్ళు కూడా మాట్లాడుతారు. మీగురించి, మీపాప గురించి కుశల ప్రస్ణలు వేస్తూ ఉంటారు. అయితే మీరు పాపకు జన్మనిచ్చిన తర్వాత వీటన్నింటినీ మిస్ అవ్వాల్సి రావచ్చు.

సహాయం చేసేవారు

మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా మంది మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీకు ఆహారాన్ని సమయానికి ఇవ్వడం, వేడి నీళ్ళు పెట్టడం, జ్యూస్ ఇవ్వడం వంటి వాటిని మీ కుటుంభ సభ్యులు ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే మీరు బేబీకి జన్మనిచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా మీకు సహాయం చేయరు. ఇతరులు సహాయం చేయడాన్ని మీరు మిస్ అవుతారు.

ఫుడ్

మీరు గర్భం దాల్చిన సమయంలో ఎంత ఆహారం అయినా తీసుకోవచ్చు. ఆ సమయంలో మీరు ఇద్దరికి సరిపడా ఆహారం తీసుకోవాలి కాబట్టి మీరు ఎంతైనా, ఏదైనా తినవచ్చు. మీరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మీరోజువారీ ఆహారం మీద ఆంక్షలు రావచ్చు.

స్కిన్

ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో రక్తప్రసరణ అధికం అవుతుంది. రక్తప్రసరణ అధికంగా జరగడం వల్ల మీ చర్మానికి గ్లో వస్తుంది. తద్వారా మీరు మరింత అందంగా తయారవుతారు. అయితే, బేబీకి జన్మనిచ్చిన తర్వాత మీరు అందాన్ని కోల్పోవచ్చు.

పీరియడ్స్‌కు టాటా

మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పీరియడ్స్ రావు. కాబట్టి మీరు ఈ 9 నెలలు ఎంతో ఆనందంగా ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా మీరు మీ బిడ్డ మీద శ్రద్ధ వహించవచ్చు.

లాభాలు

మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చిన్న సైజు సెలబ్రిటీ అయిపోతారు. ఎలాగంటే, మీకు ఏదైనా కావాలంటే వెంటనే దొరుకుతుంది, మీరు ఎక్కడికైనా వెల్తే ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. బస్‌లో వెల్తే మీకు సీట్ ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరూ మిమ్మల్ని వెయిట్ చేయించరు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మీరు ఇవన్ని మిస్ అవుతారు.

కిక్స్

మీరు ప్రెగ్నెన్సీ్‌లో ఉన్నప్పుడు మీకు అమితాన్నందాన్ని కలిగించేది ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డ కదలికలు. ఆ కదలికల కోసమే మీరు కొన్ని నెలలుగా వేచి ఉంటారు. మీరు మొదటిసారి కదలికలను గమనించినప్పుడు మీకు చాలా ఆనందం వేస్తుంది.  అయితే బిడ్డ పుట్టిన తర్వాత వీటికి దూరం అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: