ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేయవచ్చా? చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!

ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రయాణం అంటే కాబోయే తల్లికి ఓకింత ఆందోళనగా ఉంటుంది. అయితే ఎప్పుడు,  ఎలాంటి పరిస్థితులలో ప్రయాణం చేయాలి, ఎప్పుడు చేయకూడతో తెలుసుకుందాం.

మొదటి త్రైమాసికం

మొదటి త్రైమాసికంలో ప్రాయాణాలు చేయవచ్చు కానీ ప్రయాణంలో మీకు అలసట, విసుగు రావచ్చు. అంతేకాక, ఒక్కోసారి ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ అవ్వవచ్చు.

రెండవ త్రైమాసికం

రెండవ త్రైమాసికంలో మీరు సులభంగా ట్రావెల్ చేయవచ్చు. మీ పొట్ట ఆకారం మీకు అనుగుణంగా ఉండవచ్చు.  అంతేకాక, మీరు వాష్‌రూమ్‌కు వెళ్ళాల్సిన పని తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా జర్నీ చేయగలరు.

మూడవ త్రైమాసికం

ఈ సమయంలో మీరు ఎంత తక్కువ జర్నీ చేస్తే అంత మంచిది. మీరు మరీ అవసరం అయితేనే జర్నీ చేయండి. వీలైతే డాక్టర్ అందుబాటులో ఉండే చూసుకోండి.

ఎప్పుడు ప్రయాణం చేయవచ్చంటే:

– మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండి, మీ డాక్టర్ కూడా ఓకే అంటేనే వెళ్ళడం మంచిది.

– మీరు వెల్తున్న వాహనం పూర్తి అనుకూలంగా, సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలి. బస్, రైలు ప్రయాణం కన్నా కార్ ప్రయాణం మంచిది.

– మీరు వెల్తున్న ప్రదేశంలో మంచి గైనిక్ ఉందేమో చూసుకోండి.

– మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి లేకపోతే చాలా అష్టపోవాల్సి వస్తుంది.

– మీ మెడికల్‌కు సంబంధించి అన్ని రిపోర్ట్స్ మీతో ఉంచుకోవడం మంచిది. దీంతో అక్కడ ఉన్న డాక్టర్ పని సులువవుతుంది.

 ఎలాంటి సందర్భాల్లో ప్రయాణం చేయకూడదు:

– మీకు ఎక్కువగా బ్లీడ్ అవుతుంటే వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే, బేబీ మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది.

– మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే మీరు ప్రయాణం చేసే సమయంలో ఎక్కువైతే ఏమీ చేయలేము.

– మీ కంటి పొర వాయడం వల్ల ఒక్కోసారి కళ్ళు సరిగ్గా కనపడకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయాలలో కూడా మీరు వెళ్ళకపోవడం మంచిది.

– మీరు ప్రయాణించే సమయంలో మీ కడుపులో ఎటువంటి అసౌకర్యం కల్గినా మీ ప్రయాణాన్ని చాలించండి.

ఈ సూచనలు పాటించడం వల్ల మీరు సులభంగా ప్రయాణం  చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: