ఇంట్లోనే పది నిముషాల్లో మీ ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను క్లీన్ చేసుకోవచ్చు

ఎంత అందంగా ఉన్నవారైనా సరే పై పెదవిపై అవాంఛిత రోమాలు ఉంటే అందవికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఉండటం వలన ఎక్కడికైనా వెళ్ళడానికి, నలుగురితో కలిసి మాట్లాడటానికి చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ టిప్స్ పాటించడం వలన అందమైన, ఆకర్షణీయమైన పెదవులు మీ సొంతం.

పాలు  పసుపు

ఒక టేబుల్ స్పూన్ పాలు మరియు పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మెత్తని పేస్ట్ గా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అవాంఛిత  రోమాలు ఉన్న పై పెదవిపై అప్లై చేసుకుని మర్దనా చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

నిమ్మరసం  తేనె

రెండు స్పూన్ల నిమ్మసరంలో ఒక స్పూన్ తేనే కలిపి, ఈ మిశ్రమాన్ని పై పెదవిపై రాసుకుంటే అవాంఛిత రోమాలకు చెక్ పెట్టవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకోవడం వలన అవాంఛిత రోమాల సమస్య ఉండదు.

ఎగ్ వైట్  షుగర్

ఎగ్ వైట్ ను ఎగ్ నుండి తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ మరియు అర టేబుల్ స్పూన్ మొక్క జొన్న పిండి కలుపుకుని బాగా మిక్స్ చేసి పై పెదవిపై అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు మూడు వారాలు చేస్తే ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

షుగర్ అండ్ లెమన్

రెండు నిమ్మకాయలు తీసుకుని వాటి నుండి రసాన్ని తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. అందులో కొంచెం షుగర్ మరియు నీరు కలిపి పేస్ట్ గా అయ్యేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పై పెదవిపై అప్లై చేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

శనగపిండి  పసుపు

ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని అందులో కాస్త పసుపు, నీరు వేసి మిక్స్ చేసుకోవాలి. నీటికి బదులుగా పాలు కలుపుకోవచ్చు. మెత్తని పేస్ట్ గా అయ్యేలా చేసుకుని అవాంఛిత రోమాలు ఉన్న పై పెదవులపై రాసుకుని ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

ప్రతి భార్య తన భర్తను తప్పకుండా అడగాల్సిన 5 ప్రశ్నలు

Leave a Reply

%d bloggers like this: