ఈ ఆహార పదార్థాలు తినడం మీ సంసారానికి మంచిది కాదు

ప్రస్తుత బిజీ,టెన్షన్ లైఫ్ లో చాలామంది దంపతులు శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తిని చూపలేకపోవడమే కాకుండా సరైన ఆనందాన్ని పొందలేకపోతున్నారని కొందరు ఆరోగ్య పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిన విషయం. శృంగారం మీద ఆసక్తిని తగ్గించే ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకండి.

ఫ్రైడ్ ఫుడ్స్ (వేయించిన పదార్థాలు)

ఏ రోజు అయితే శృంగారంలో పాల్గొనాలి అనుకున్నపుడు ఆ రోజు ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం  మంచిది. వీటిని తీసుకోవడం వలన శృంగారంపై ఆసక్తి, కోరికలు తగ్గిపోతాయి. అలాగే మగవారిలో వీర్యకణాల విడుదలను తగ్గించివేస్తాయి. కేవలం శృంగారం మీద ఆసక్తే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మంచివి కావు.

షుగర్

మగ ఆడ అనే తేడా లేకుండా శృంగార వాంఛలను, శృంగారంలో పాల్గొనాలి అనే ఆసక్తిని దూరం చేసే పదార్థం షుగర్. అందుకే షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్, ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శృంగారాన్ని ఉత్తేజపరిచే టెస్టొస్టిరాన్ ను షుగర్ బాగా తగ్గించివేస్తుంది.

పాప్ కార్న్

పడకగదిలో కోరికలను దూరం చేసే మరో ఆహార పదార్థం పాప్ కార్న్. ఇద్దరు దంపతుల మధ్య శృంగారంపై ఆసక్తి తగ్గేలా చేస్తుంది. అందుకే వైద్యులు సైతం వీటిని రెగ్యులర్ గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వలన టెస్టోస్టిరాన్ లెవల్స్ పూర్తిగా పడిపోతాయి కూడా.

కాఫీ-సోంపు

ఏదైనా ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి గానీ అధిక మోతాదులో తీసుకుంటే కష్టమే.  ముఖ్యంగా కాఫీ, భోజనం తర్వాత తీసుకునే సోంపు ఎక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం వలన మీ శృంగార కోరికలను దూరం చేస్తాయి.

స్టోర్ ఫుడ్స్ – ఆల్కహాల్

మనలో చాలామంది కూల్ డ్రింక్స్ క్యాన్స్ లో స్టోర్ చేసినవి, ప్లాస్టిక్ కవర్స్ లలో నిల్వఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది మీ శృంగారంపై ప్రభావాన్ని చూపెడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆల్కహాల్ సేవించడం వలన శృంగారంపై ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది.

ఇక్కడ చెప్పుకునే విషయాల కన్నా రతిపై ఆసక్తిని పెంచే ఆహారాల గురించి మీరు విని ఉంటారు. ఈ విషయం ఎవరూ చెప్పి ఉండరు. అందుకే చెప్పడం జరిగింది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ప్రసవం తర్వాత కూడా శృంగారం అద్భుతంగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన 8 విషయాలు

Leave a Reply

%d bloggers like this: