ఎదభాగం ఉన్నట్లుండి పెరగటానికి కారణాలు..? ఇలా జరిగితే ఏమైనా సమస్యలా..!

ఏ ఒక్కరిలోనో ఇద్దరిలోనో కాదు చాలామంది మహిళలకు ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఉన్నట్లుండి వక్షోజాల పరిమాణంలో మార్పులు కలగడం అంటే పెద్దవిగా, చిన్నవిగా ఉండటం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలామంది కంగారుపడుతుంటారు. వక్షోజాల సైజు తగ్గడానికి, పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..

గర్భంతో ఉన్నప్పుడు

గర్భంతో ఉన్నప్పుడు ప్రతి మహిళలోనూ వక్షోజాల సైజు పెరిగటం సహజమే. ఎందుకంటే గర్భం సమయంలో హార్మోన్ల మార్పుల వలన స్తనాలలోకి రక్తప్రసరణ ఎక్కువగా జరిగి వక్షోజాల పరిమాణం జరుగుతుంది.

బరువు పెరిగినప్పుడు

స్తనాలు స్తన కణజాలం, గ్రంథులు, కొవ్వు కణజాలంతో నిర్మితమై ఉంటాయి. ఎప్పుడైతే అధిక బరువు పెరగటం  వలన స్తనాలు కూడా ఉబ్బినట్లుగా ఉంటాయి. మళ్ళీ బరువు తగ్గగానే వక్షోజాల పరిమాణంలో మార్పు తెలుస్తుంది.

వయస్సు మారుతున్నప్పడు

మహిళలు చిన్న వయస్సు నుండి యవ్వన వయస్సులోకి మారుతున్నప్పుడు శరీరంలో జరిగే కొన్ని మార్పులలో వక్షోజాల పరిమాణం కూడా ఒకటి.

ఏకాంతంగా ఉన్నప్పుడు 

దంపతులు ఏకాంతంగా ఉన్నపుడు ఇద్దరి మధ్య భావప్రాప్తి ఎక్కువగా ఉండటం వలన తెలియకుండానే రక్తప్రసరణ అధికమై ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అలా హార్ట్ బీట్ పెరగగానే వక్షోజాలు ఉబ్బినట్లుగా ఉంటాయి. ఇది పూర్తవ్వగానే కొన్ని నిముషాల తర్వాత మళ్ళీ సాధారణ స్థితిలోకి వచ్చేస్తాయి.

నెలసరి అయినప్పుడు

నెలసరి అయిన ప్రతిసారీ పొత్తి కడుపులో ఎలా ఐతే నొప్పి కలుగుతుందో వక్షోజాలు ఉన్నట్లుండి పెరగడం జరుగుతుంది. నెలసరి సమయంలో  ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ శరీరంలో ఎక్కువగా ఉండటం వలన అధిక రక్తప్రసరణ జరిగి స్తనాల సైజులో మార్పు కలుగుతుంది.

రొమ్ము గడ్డలు

పాలిచ్చే తల్లులతో పాటు సాధారణ మహిళలలోనూ కొన్నిసార్లు వక్షోజాలు గడ్డలు కట్టినట్లు, ఎర్రగా కందిపోవడం, వాసన వస్తుండటం, నొప్పిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

మందులు 

కొన్ని మెడిసిన్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన కూడా వక్షోజాల సైజు పెరగడానికి, తగ్గడానికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. 

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

Leave a Reply

%d bloggers like this: