పిల్లలకు ఆహారాన్ని తినిపించడం ఎలా అని చాలా మంది తల్లులు ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలకు మొదట్లో ఆహారం తినిపించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆహార పధార్థాలు తింటే వారికి తొందరగా జీర్ణం అవుతుంది అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎదిగే పిల్లల కోసం డైట్ ప్లాన్ ఎలా తయారుచేసుకోవాలో చూడండి…
తల్లి పాలు
మొదటి 6 నెలలు పిల్లలకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించడం మేలు. ఆ తర్వాత మీరు తింటున్న ఆహారం మీద వారికి శ్రద్ధ కలిగితే అప్పుడు వారికి ఫుడ్ పెట్టడం మొదలుపెట్టాలి. వారికి మొదటగా మెత్తని కాయగూరలు, పళ్ళు వంటి వాటిని ఆహారంగా ఇవ్వాలి.
సీరియల్స్
చిన్న పిల్లలకు మొదటగా మెత్తని ఆహారంతో పాటూ సీరియల్స్, చాకోస్ వంటి బయట దొరికే పధార్థాలు పెట్టవచ్చు. ఈ క్రంచీస్ మంచి రుచిని కలిగి ఉండటమే కాక పిల్లలకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ ఉంటాయి. వీటిని తినడానికి చిన్నపిల్లలు కూడా ఆసక్తి చూపుతారు.
పండ్లు
చిన్నపిల్లల డైట్‌ను పళ్ళతో మొదలుపెట్టడం కూడా మంచి ఆలోచన. అయితే ఆ పళ్ళలో ఎక్కువ నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. అయితే మీరు ఆహారం మొదలుపెట్టే ముందు ఒక సారి వైద్యుని సలహా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే, కొన్ని పళ్ళను ఆహరంగా తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు జీర్ణం కాక ఇబ్బంది పడవచ్చు.
బీన్స్
మీరు మీ పిల్లలకు ఆహారం మొదలుపెట్టడానికి బీన్స్, చిరు ధాన్యాలను కూడా ఉపయోగించవచ్చు. వీటిలో అధిక సంఖ్యలో న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల బిడ్డకు పోషణ అంది బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటూంది.
మాంసం మరియు కూరగాయలు
మీ పిల్లల డైట్లో మాంసాన్ని, కూరగాయల్ని చేర్చడం వల్ల మీ పిల్లల పెరుగుదలలో మంచి మార్పును గమనించవచ్చు. కూరగాయల వల్ల మీ పిల్లలకు కావల్సిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మీ పిల్లల కండరపుష్టికి మరియూ మెదడు పెరుగుదలకు మాంసం చాలా దోహదం చేస్తుంది. అంతేకాక, మాంసంలో శరీరానికి కావల్సిన అన్ని పోషకాలూ ఉంటాయి.
పాల ఉత్పత్తులు
వీటితో పాటూ మీ పిల్లల డైట్లో పాల ఉత్పత్తులకు కూడా చోటు ఇవ్వండి. పాలలో ఉండే కాల్సియం ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీని వల్ల మీ పిల్లలు చిన్న వయసులోనే బలంగా తయారవడం మీరు గమనించవచ్చు. అంతేకాక, శరీరంలోని ఎముకల వ్యవస్థ చిన్న వయసులోనే అభివృద్ధి చెందాలంటే పాల ఉత్పత్తులు తప్పనిసరి.