పిల్లలు పుట్టాక మీ భర్తలో వచ్చే మార్పులు : ప్రతి భార్య తెలుసుకోవాలి

IImage Courtesy : ashwin kireet

అమ్మ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచితే నాన్న బాధ్యతతో కూడిన బంగారు భవిష్యత్ ఇవ్వడానికి బిడ్డ పుట్టిన ప్రతి క్షణం నుండి ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మనాన్నలకు అంత విలువైన స్థానం ఉంటుంది. అయితే పిల్లలు పుట్టాక మీ భర్తలో ఎలాంటి మార్పులు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

సంపాదన

తండ్రే అంటే బాధ్యత అని ముందే చెప్పుకున్నాం కదా. అందుకే పిల్లలు పుట్టిన తర్వాత వారికి మంచి చదువు, మంచి జీవితం ఉండాలని అప్పటికంటే ఎక్కువగా కష్టపడుతూ డబ్బు సంపాదనలో తలమునకలవుతాడు.

నిద్ర సరిపోదు

సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి రెండేళ్ల పాటు మాత్రమే సరైన నిద్ర ఉండదు.  అదే తండ్రికి జీవితాంతం సరైన నిద్ర ఉండదు. వారి గురించే ఆలోచించడం, వారి కోసం ఇంకా ఏం చేస్తే ఆనందంగా ఉంటారు అనుకుంటూ జీవితం గడిపేస్తారు.

ఇష్టాలు తగ్గించుకుంటారు

పిల్లలు పుట్టాక మీ భర్తలో వచ్చే అతి పెద్ద మార్పు ఇదే. ఇష్టమైన హీరో సినిమాకు మొదటిరోజు ఎంతో డబ్బు ఖర్చు పెట్టే అతను వారం రోజుల తర్వాత వెళ్దాంలే అంటూ ఖర్చులు తగ్గించుకుని, ఆ డబ్బు పిల్లలకోసం, భార్య కోసం ఆదా చేస్తాడు.

ఆకలిని చంపుకుంటాడు

తల్లితండ్రులు పిల్లలు పుట్టాక ఏం చేసినా సరే అది వారి పిల్లల కోసమే అయి ఉంటుంది. తమ పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాలని తమ ఆకలిని తగ్గించుకుని వారికి మాత్రం మంచి ఫుడ్ ఇస్తారు. ఈ విషయంలో అమ్మ నాన్న ఇద్దరూ అంతే. ప్రతి మధ్య తరగతి జీవితంలోని ఈ విషయం తెలుస్తుంది.

పార్టీలు, పబ్బులు ఉండవు

పిల్లలు ముందు, పిల్లల తర్వాత వచ్చే మార్పులలో మరో ముఖ్యమైన వాటిలో మరొకటి. అప్పటివరకూ ఫ్రెండ్స్, పార్టీలంటూ తిరిగిన ప్రతి భర్త ఆ తర్వాత ప్రతి క్షణం పిల్లల కోసమే ఆలోచిస్తారు, వారికోసమే ఖర్చు చేస్తారు.

ఒత్తిడికి లోనవుతుంటాడు

తన పిల్లలకు ఏమి కాకూడదు, వారు ఆరోగ్యంగా ఉండాలని ఇల్లు అంతా శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలు తెస్తూ ఉంటాడు. పిల్లలకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే ఒత్తిడికి లోనవుతాడు.

తను చూడని జీవితం

ప్రతి భర్త తండ్రి అయిన తర్వాత చిన్నతనంలో తను మిస్ అయిన ప్రతి ఆనందాన్ని తన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడతాడు. పిల్లలకు ఏం కావాలో అడిగిమరీ తెలుసుకుంటాడు.

బాధ్యత పెరిగింది

పిల్లలు పుట్టాక మీ జీవితంలో ఎంత సంతోషం వస్తుందో మీ భర్త జీవితంలోకి ఆనందంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుంది. మీకు, మీ పిల్లలకు ఉన్నతమైన జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మీ భర్తపై ఉంది.

అందుకే బయట ఎన్ని టెన్షన్స్, మానసిక ఒత్తిడి, వర్క్ టెన్షన్స్ ఉన్నా మీతో సరదాగా గడుపుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఇవండీ మీ ఆయనలో పిల్లలు పుట్టాక వచ్చే మార్పులు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

పిల్లలు తెల్లగా పుట్టాలంటే, ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: