పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ దాంపత్య బంధం బలంగా ఉండడానికి 5 మార్గాలు!!

మీ ఇంటికి  బిడ్డ వచ్చినప్పుడు మీ మీద అదనపు బాధ్యతలు ఉంటాయి. మీ బిడ్డను ఎలా పెంచాలి, ఏ స్కూల్‌లో వేయాలి, ఎలాంటి బవిష్యత్తును ఇవ్వాలి అనే ఆలోచనలు ఉంటాయి. వీటి గురించి ఆలోచించినప్పుడు మీకు మరింత ఆందోళన కలగవచ్చు. అంతేకాక, మీకు బేబీ పుట్టిన తర్వాత మీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాలలో మీరు మీ బాగస్వామితో కలిసి కొంత సమయాన్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో మీరు మరింత దగ్గర అవ్వవచ్చు . వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,

ఏకాంతంగా గడపండి

మీకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడప్పుడు బయటకు వెల్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు మీ గురించి మాత్రమే మాట్లాడుకొనే అవకాశం వస్తుంది. మీలో ఉన్న ఆలోచనలు ఒకరికొకరికి తెలుస్తాయి. దీని వల్ల మీకు కొద్దిపాటీ రీఫ్రెష్‌మెంట్ కూడా వస్తుంది.

ఇంట్లోనే డేట్

మీరు బయటకు వెళ్ళలేని సమయంలో ఇంట్లోనే డేట్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీ బేబీ బాగా నిద్రపోయిన తర్వాత ఏదైనా సినిమా చూస్తూనో, గేం ఆడుతూనో ఒకరితో ఒకరు స్పెండ్ చేయడం అలవరుచుకోండి. దీని ద్వారా మీకు కొంత ఏకాంతం లభించినట్లౌతుంది.

మాట్లాడుకోవడం

మీరు నిద్రపోయే ముందు బెడ్ మీద ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోండి. మీ రోజు ఎలా గడిచిందనో లేక మీరు చూసిన సినిమా గురించి మాట్లాడుకోవడమో, వీకెండ్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడమో చేయాలి. దీని ద్వారా కూడా మీ రిలేషన్ పెరుగుతుంది.

సర్‌ప్రైజ్

మీ బాగస్వామిని అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేయండి. ఆమెకు నచ్చిన బహుమతి ఇవ్వడం, అతనికి నచ్చిన చోటుకు తీసుకెళ్ళడం వంటివి చేయాలి. దీని ద్వారా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగే అవకాశం ఉంది.

షేర్ చేసుకోవడం

మీరు జీవిత బాగస్వామ్యులు కాబట్టి మీరు చేసే ప్రతి పనిని మీ భర్తతో షేర్ చేసుకోండి. అతనికి ఆఫీస్‌లో ఎక్కువ పని ఉన్నప్పుడు ఇంటీకి వచ్చిన తర్వాత మీరు షేర్ చేసుకోవడం, మీకు ఇంట్ళో పని ఉన్నప్పుడు మీవారు షేర్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.

బహుమతులు

మీరు మీ బాగస్వామికి తరచుగా బహుమతులు ఇస్తూ ఉండండి. పుట్టినరోజు నాడు, పెళ్ళిరోజు నాడు, పండుగలకు బహుమతులు ఇవ్వడం  ద్వారా ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమ తగ్గలేదని అర్థం అవుతుంది. దీంతో మీరు మరింత అన్యోన్యంగా ఉంటారు.

మునుపటిలా చిలిపిగా ఉండండి

చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత మంచి తల్లిదండ్రులు అవ్వాలని అనుకుంటారు కానీ మంచి బార్యాభర్తలు అవ్వాలని అనుకోరు. కాబట్టి మీకు బేబీ కలగక ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. చిలిపిగా మాట్లాడుకోవడం, నాటీ చేష్టలు చేయడం. అతను ఊహించని సమయంలో ముద్దు పెట్టడం, గిల్లడం వంటీవి చేస్తూ జాలీగా ఎంజాయ్ చేయండి.

స్నేహితులతో ట్రిప్

మీరు మీ స్నేహితులతో ఏక్కడికైనా ట్రిప్ వేయండి. వారికి కూడా మీలానే పిల్లలు ఉండేలా చూసుకోండి. వారి అనుభవాలను అడుగుతూ, మీ అనుభవాలను కూడా వారికి చెప్పడం ద్వారా మీరు మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు అంతేకాక, మీకు ఉండే ఒత్తిడిని కూడా కోల్పోతారు.

ఈ విధంగా మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని ఉండేలా ప్లాన్ చేసుకోండి.  దీంతో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చే చాన్స్ ఉండదు. తద్వారా మీ వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా సాగిపోతుంది.

Leave a Reply

%d bloggers like this: