ప్రపంచంలో ప్రతి 90 సెకండ్లకు ఒక గర్భవతి చనిపోతోంది, అసలు కారణాలు ఇవే

ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించే విషయం ఇది. ప్రపంచంలో ప్రతి 90 సెకండ్లకు ఒక గర్భవతి ప్రసవ సమయంలో మృతి చెందుతోంది. అసలు కారణాలు తెలుసుకుంటే ఇంత చిన్న విషయమా? అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకుని రేపటికి భవిష్యత్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

పౌష్టికాహార లోపం

గర్భవతి ప్రసవ సమయంలో మృతి చెందడానికి ప్రధాన కారణం సరైన పౌషకాహార లోపం లేకపోవడమే. ఇది కేవలం ఇప్పటినుండే కాదు కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నా, ప్రజలకు అవగాహన వచ్చేలా చెబుతున్నా కూడా పౌష్టికాహార  లోపం కారణంగా గర్భవతులు  చనిపోవడం లేదా పుట్టే పిల్లలపై పరోక్షంగా ఆ ప్రభావం చూపెడుతోంది.

బాల్యవివాహాలు

ప్రస్తుతం బాల్యవివాహాలు చాలా వరకు తగ్గిపోయాననని మనం అనుకోవచ్చు గానీ, ప్రపంచ నలుమూలలోని అనాగరికత ప్రాంతాలలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతున్నాయి. తక్కువ వయసులోనే పెళ్లి, గర్భం, ఆ గర్భం ఎలా కాపాడుకోవాలో సరైన అవగాహన లేకపోవడమే ప్రసవ సమయంలో గర్భవతి మృతి చెందడానికి మరో ప్రధాన కారణం.

రక్తహీనత

రక్తంలో హిమోగ్లోబిన్ శాతం సరిపడా లేకపోవడాన్ని రక్తహీనత అని అంటారు. ఇది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పౌషక విలువలు లేని ఆహారం తీసుకోవడం, ప్రగ్నెన్సీ సమయంలో ఏ ఆహారం మంచిది, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనే అవగాహన లేకపోవడం వలనే ఈ విధంగా జరుగుతోంది.

ప్రసూతి రక్తస్రావం

ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ప్రసూతి మరణాలు సంభవిస్తుండగా, ఒక్క మనదేశంలో మాత్రమే దాదాపు 26% ప్రసూతి మరణాలు జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రసవానంతరం రక్తస్రావం అంటే పిల్లలు పుట్టిన 24 గంటలలోపు సుమారు 1000 మిల్లీ లీటర్ల రక్తం మహిళలు నష్టపోవడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.

ఆరోగ్యం గురించి అవగాహన

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, చిన్న పిల్లలకు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయనేది నిజం. అయితే హెచ్ ఐ వి వంటి ప్రమాదకర వ్యాధులు ఎప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయో చెప్పడం కష్టం. ఇలా గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడం, అబార్షన్స్ లో లోపం కారణంగా మిగతా ప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు.

అందుకే ఈ విషయాలపై ప్రతి ఒక్కరికీ  అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

Leave a Reply

%d bloggers like this: