అప్పుడే పుట్టిన పిల్లల గురించి మీకు ఎవరు చెప్పని 10 విషయాలు

గర్భవతి అయినప్పుడు మీరు ఎంత సంతోషిస్తారో, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు తల్లితండ్రులుగా  మీరు చేయకుండా ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ విషయాలను ఎవరు మీకు చెప్పరు.

మీరు అనుకున్నంత చలి వారికి ఉండదు

పిల్లలకు చలి ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వారి శరీరాన్ని మొత్తం ఉన్ని దుస్తులతో నింపేస్తుంటారు. ఇలా చేయడం వలన వారికి సరైన గాలి ఆడదు. ఉదాహరణకు మీ శరీరం వేడిగా ఉన్నప్పుడు ఎవరైనా మీపై ఉన్ని దుస్తులు కప్పితే చికాకుగా ఉంటుంది కదా. అలాగే రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మీకు ఎంత ఉష్ణోగ్రత, ఎంత చలి ఉంటుందో వారికి కూడా అలానే ఉంటుంది.

మొదటి చూపులోనే బంధం కలగదు

నా బిడ్డ పుట్టగానే నన్ను గుర్తుపట్టలేదు, నాతో బంధం సరిగ్గా ఉండదేమో అని అనుకుంటుంటారు చాలామంది. నిజానికి పుట్టగానే తల్లితో లేదా తండ్రిని గుర్తుపట్టడానికి వారికి కొంత సమయం పుడుతుంది. మొదటి చూపులోనే మీపై ప్రేమ పుట్టదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆకలి కలిగినా, ఏడుపు వచ్చినా మీ వైపే చూస్తారు.

సలహాలు చాలామంది ఇస్తుంటారు

మీకు పిల్లలు పుట్టగానే బిడ్డకు ఈ డైపర్ వాడండి, ఫలానా కంపెనీ డైపర్స్ బాగుంటాయి, ఈ ఆహారం తినిపించండి, బిడ్డకు ఇన్నిసార్లు పాలు ఇవ్వాలి, బిడ్డ పుట్టింది నువ్వు ఎలా నిద్రిస్తావో..ఇలా మీ పక్కన చెప్పేవారు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయితే వారు చెప్పిన విషయాలు మంచివి అనిపిస్తే తీసుకోండి లేక వైద్యుడి సలహాలను పాటించండి.

పిల్లల మల మూత్ర విసర్జన గురించి

నవజాత శిశువుల గురించి ప్రతి తల్లితండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. వారి మల మూత్ర విసర్జన గురించి. శిశువు యొక్క పేగు కదలికలు వారి ఆరోగ్యాన్ని సూచిస్తాయి. అయితే మూత్ర విసర్జన ఏ రంగులో వస్తుంది అనే దానికి టెన్షన్ పడకుండా, యూరిన్ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండటం మంచిది.

మొదటిసారి పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు

అప్పుడే పుట్టిన పిల్లలకు స్నానం చేయిస్తున్నపుడు వారి చర్మంపై సబ్బు,నీరు పడగానే వారి నరాలు విచ్చుకున్నట్లుగా శరీరం వదులుగా ఉండటం జరుగుతుంది. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు టెన్షన్ అనిపిస్తుంటే వెంటనే మీ పర్సనల్ డాక్టర్ ను సంప్రదించండి.

బిడ్డకు పాలివ్వడానికి సిగ్గు పడకూడదు

తల్లికి బిడ్డపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు తల్లి పాలకు బదులుగా ఫార్ములా మిల్క్ పై దృష్టి పెడుతుంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్లే అమ్మలు ఈ విధంగా చేస్తుంటారు. అయితే ఇప్పుడు తల్లి పాలు బిడ్డకు అందకపోతే ముందుముందు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది.

దుస్తులను మారుస్తూ ఉండాలి

తల్లి పాలు తాగినప్పుడు కొన్ని సార్లు వాంతులు చేసుకోవడం, నిద్రలోనే యూరిన్ చేయడం చేస్తుంటారు. అలాగే మీ పక్కనే బిడ్డ పడుకున్నప్పుడు మీకు చమట కలిగి దుప్పట్లు తడి అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకని ఎప్పటికప్పుడు వారి దుస్తులను తీసివేయడం, మీ దుస్తులు దుప్పట్లు శుభ్రంగా ఉండటం చూసుకోవాలి.

తల జుట్టు రాలుతూ ఉంటుంది

పిల్లలు ఎక్కువ జుట్టుతో పుట్టడం, కొందరు తక్కువ జుట్టుతో జన్మించడం సహజమే. అలాగే మొదటి కొన్ని నెలలలో వారి తలపై జుట్టు రాలడం కూడా సహజమే కాబట్టి మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జుట్టు తిరిగి వస్తుంది.

బిడ్డ డైపర్స్ గురించి

తల్లి ఉమ్మి నీరు మింగి, మూత్ర విసర్జన చేసి పిల్లలు పుట్టారని చెబుతుంటారు. అటువంటప్పుడు బిడ్డ డైపర్ లో మూత్ర విసర్జన చేసుకోవడం పెద్ద విచారమేమీ కాదు.. అదే ఆడపిల్ల అయితే కొన్నిసార్లు రక్తస్రావం కూడా జరుగుతుంటుంది. అది వారి శరీర హార్మోన్ల కారణంగా జరిగి మళ్ళీ వెంటనే ఆగిపోవడం జరుగుతుంటుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ప్రెగ్నన్సీ ముందు, తరువాత ఆరోగ్యాంగా ఉండడానికి తినే ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు

Leave a Reply

%d bloggers like this: