ఈ నాలుగు ఆహారాలు మీ గర్భంలో బిడ్డకు ప్రమాదం : ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తినకండి

ప్రెగ్నన్సీ మీ మాతృత్వానికి మొదటి మెట్టు. అందుకే ప్రెగ్నన్సీ తో ఉన్న ఆ సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం మీతో పాటు మీ కడుపులో బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఆహరం, ఈ సమయంలో ఆహరం చాలా అవసరం.  అయితే మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేగన్సీ తో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అవేంటో చూడండి…

1. క్యాన్డ్ ఫుడ్స్ (Canned foods)

వండి క్యాన్స్ లో భద్రపరచి అమ్మే ఆహారాలను క్యాన్డ్ ఫుడ్స్ అంటారు. వీటిని మీరు ప్రెగ్నన్సీతో ఉన్న సమయంలో అసలు తినకూడదు.  క్యాన్డ్ ఫుడ్స్ లో బైస్ఫెనోల్-ఏ (Bisphenol-A or BPA) అనే కెమికల్ ఉంటుంది. దీని కారణంగా ప్రెగ్నన్సీ సమయంలో, హైపర్ ఆక్టివిటీ, చిరాకు, అసహనం లాంటివి వస్తుంటాయి. చేపలను క్యాన్స్ లో భద్రపరిచినప్పుడు, అందులో మిథైల్ ఉంటుంది. ఇది కడుపులో పిల్లల మెదడు ఎదుగుదలను సరిగా జరగనివ్వదు. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో క్యాన్స్ లో ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.

2. కెఫిన్ (Caffeine)

ప్రెగ్నన్సీ సమయంలో కెఫిన్ అధికంగా ఉండే కాఫీ తీసుకోవడం, గర్భంలోని పిండం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. దీనికారణంగా పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతారు. దీని కారణంగా పిల్లలకు పుట్టుక లోపాలు వస్తాయి, కడుపు పోవడం కూడా జరగవచ్చు. అందుకే మీకు కాఫీ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే, ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి.

3.సరిగా ఉడకని మాంసం

మాంసం మినరల్స్ తో , విటమిన్స్ తో పుష్కలంగా నిండి ఉంటుంది. అయితే సరిగా ఉడకని మాంసంలో బాక్టీరియా ఉంటుంది. ఉడకని మాంసంలో ఉండే సాల్మొనెల్లా (Salmonella), లిస్టిరియ (listeria) అనే బాక్టీరియా ఉంటాయి. ఇవి మీ నుంచి కడుపులో ఉన్న మీ పిల్లలకు చేరి, వారికి హాని కలిగిస్తాయి. అందుకే మీరు ప్రెగ్నన్సీ సమయంలో తీసుకునే ఆహారాన్ని బాగా ఉడికించి తినండి.

4. పచ్చి పాలు

 పాలుప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం చాలా మంచిది. మీ శరీరానికి కావాలిన కాల్షియమ్,  ప్రోటీన్స్ ను అందిస్తుంది.  కానీ సరిగా కాగపెట్టని, లేదా పాచి పాలను మాత్రం తాగకండి. అందులో ఉండే బాక్టీరియా మీకు, మీ కడుపులోని బిడ్డకు హాని చేస్తాయి.

Leave a Reply

%d bloggers like this: