కడుపులో బిడ్డ నిలబడపోవడానికి కారణాలు : గర్భం ప్రమాదంలో ఉందని చెప్పే లక్షణాలు

గర్భం దాల్చడం, తల్లి కావడం అనేది మహిళకు ఒక గొప్ప వరం. కానీ కొందరిలో మాత్రం గర్భం దాల్చిన కొన్ని రోజులలోనే గర్భం నిలబడక  పోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో చాలామంది మదనపడుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు ఐతే వారిని సూటిపోటి మాటలతో ఇంకా బాధిస్తూ ఉంటారు. అసలు గర్భం పోవడానికి కారణాలు ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకోండి.

గర్భం పోవడానికి కారణాలు

సాధారణంగా వయస్సు పై బడుతున్నప్పుడు గర్భం పోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా కాదంటే గర్భిణీగా ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అధిక బరువు ఉండటం, ధూమపానం, మద్యపానం అలవాట్ల వలన, జన్యుపరమైన లోపం, గర్భాశయ నిర్మాణం సరిగ్గా లేకపోవడం, గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉండటం, ఒత్తిడి, భయాందోళన, ఎప్పుడు వ్యాధులతో అంటే రక్తహీనత, మధుమేహం వంటి సమస్యలతో  బాధపడటం కారణాలుగా చెప్పవచ్చు.

గర్భం పోతుంది అని తెలిపే లక్షణాలు:
పొత్తి కడుపులో నొప్పి

గర్భం నిలబడకుండా పోతుంది అని చెప్పడానికి పొత్తి కడుపులో తరచూ నొప్పి కలుగుతూ ఉండటం,యోని నుండి రక్తస్రావం, రక్తం గడ్డలుగా రావడం, ముక్కలుగా పడిపోతున్నపుడు నొప్పి ఎక్కువగా ఉండటం గర్భం పోతుంది అని చెప్పే మొదటి లక్షణం.

గర్భసంచిలో పిండం

గర్భిణీ మహిళలలో కొంతమందిలో రక్తపు గడ్డలు కడుపులో ఎరుపుగా లేదా నలుపుగా ఉండి కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, అది కూడా ఒకవైపే ఈ నొప్పి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిండం గర్భసంచిలో కాకుండా ఫలోఫియన్ ట్యూబ్స్ లో పెరుగుతూ ఉండటం జరుగుతుంది. అప్పుడు తల్లికి కూడా ప్రమాదమే కాబట్టి వైద్యులను తప్పక సంప్రదించాలి.

మిస్ క్యారేజ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కడుపుపై భారం పడే పనులు చేయడం వలన, బరువులు ఎత్తడం, మలబద్ధకం సమస్య ఇందుకు కారణం. అయితే రెగ్యులర్ గా ఎక్సర్ సైజెస్ చేస్తూ ఉండటం, ఫోలిక్ యాసిడ్ ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం,ఒత్తిడి లేకుండా చూసుకోవడం, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం, సరైన బరువు మైంటెన్ చేయడం చేయాలి.ఉన్నట్లుండి బరువు తగ్గిపోవడం, నీరసంగా ఉండటం, బ్యాక్ పెయిన్ రావడం, యోని నుండి రక్తస్రావం జరుగుతూ ఉండటం మిస్ క్యారేజ్ లక్షణాలుగా చెబుతున్నారు.

గర్భం మళ్ళీ వస్తుందా..?

ఒక్కసారి గర్భంపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా అనే అనుమానం,భయం చాలామంది దంపతులలో ఉన్నాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చాలాతక్కువ మందిలో మళ్ళీ గర్భం వచ్చినా నిలబడకపోవచ్చు కానీ ఒక ఋతుచక్రం తర్వాత మళ్ళీ గర్భం వస్తుంది. ఒకవేళ తరచూ గర్భం పోతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహాలు పాటించాలి.

చాలామంది మహిళలకు ఇక్కడ చెప్పుకునే విషయాలు తెలియక గర్భాన్ని కోల్పోతున్నారు. దయచేసి అందరికీ తెలిసేలా SHARE చేయండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHAREచేయండి.   మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపెడుతుందా?

Leave a Reply

%d bloggers like this: