తల్లితండ్రులు మాట్లాడే మాటలు పిల్లల తెలివితేటలపై నిజంగానే ప్రభావం చూపిస్తాయా??

పిల్లలకు మొదటి స్నేహితులు తల్లితండ్రులు. ప్రపంచం ఎలా ఉంటుందో, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో తల్లితండ్రుల ద్వారానే తెలుసుకుంటారు. మరి తల్లితండ్రుల ప్రవర్తన నిజంగానే పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపెడుతుందో లేదో తెలుసుకుందాం…

పిల్లల తెలివితేటలపై తల్లితండ్రుల ప్రవర్తన

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లలపై భవిష్యత్ మరియు వారి తెలివితేటలపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా వివరించారు. ఇంతకీ వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయంటే..

ఒత్తిడి,మానసిక ఆందోళన

తల్లితండ్రులు చిన్న చిన్న విషయాలకు పిల్లల ముందే గొడవ పడటం, సమస్యలకు కుంగిపోవడం, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చిరాకు తెచ్చుకుని అరవడం వంటివి చేయడం వలన పిల్లలకు తెలియకుండానే భయం ఆందోళన మొదలవుతాయి.

కఠినంగా, సరళంగా ఉండకూడదు

పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని పిల్లల పట్ల కఠినంగా ఉండటం మంచిది కాదు. అలాగే పిల్లల ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం కూడా వారిపై ప్రభావాన్ని చూపుతుంది. తప్పుచేసినా మా పేరెంట్స్ ఏమీ అనరులే అనుకుంటారు. అందుకని ఎప్పుడు ఎలా ఉంటే వారికి మంచిదో ఆ విధంగా ఉండాలి.

ఆర్ధిక పరిస్థితులు

పిల్లలకు డబ్బు విలువ, మనుషుల విలువ, ప్రేమ, ఆప్యాయతలు తెలియడం మంచిదే. అంతేకానీ ప్రతిసారీ వారికి మన పరిస్థితి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం అని చెప్పడం వలన వారి మనస్సు డబ్బు మీదే ఉండే అవకాశం ఉంది. మిగతా విషయాలు అస్సలు పట్టించుకోరు.

స్నేహంగా ఉండాలి

పిల్లలను అర్థం చేసుకోవాలంటే మీరు కూడా పిల్లలలా మారిపోవాలి. అప్పుడు వారిని బాగా అర్థం చేసుకుంటారు. వారితో స్నేహంగా సరదాగా మెలగడం వలన ప్రతి విషయాన్ని మీతో చెప్పుకుంటారు. స్నేహంగా ఉండటం వలన పెద్దయ్యాక వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలరు.

మీ లక్ష్యాలను రుద్దకూడదు

చిన్నప్పటి నుండీ నువ్వు ఇది కావాలి? అలా చేయాలి? అనే లక్ష్యాన్ని పెట్టడం వలన వారి ఇష్టాలను, సంతోషాలను మీరు లాగేసుకున్నవారవుతారు. రేపు పెరిగి పెద్దయ్యాక వారు ఏమీ సాధించలేకపోతే మీరే కారణమవుతారు.

పిల్లల ముందు ఆ విధంగా చేయకూడదు

తల్లితండ్రులు పిల్లలతో సరదాగా ఉండటం మంచిదే కానీ వారి ముందే దగ్గరవ్వడం తెలియకుండా చేసే పనుల వలన వారికి నెగటివ్ ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఎప్పటికీ వారిముందు ఆ విధంగా ప్రవర్తించకూడదు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

భార్యాభర్తల మధ్య పిల్లల గురించి జరిగే హాస్యాస్పద సంభాషణలు

Leave a Reply

%d bloggers like this: