తల్లి పాలలో రక్తం రావడానికి కారణాలు : ఈ పాలు తాగితే బిడ్డకు ప్రమాదమా?

పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వడం వలన పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి రొమ్ముల నుండి పాలతో పాటు రక్తం కూడా వస్తుంది. ఈ విధంగా జరగడానికి కారణాలు ఏంటి?, రక్తంతో పాటు వచ్చిన ఆ పాలు తాగడం వలన పిల్లలకు ఏం జరుగుతుంది?

పాలలో రక్తం వస్తుందని ఎలా తెలుసుకోవాలి?

సాధారణంగా బిడ్డ పాలు తాగేటప్పుడు కొన్నిసార్లు బయటకు కారినప్పుడు లేదా రక్తం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే బయటకు ఉమ్మివేయడం గానీ వాంతులు చేసుకోవడం ద్వారా గుర్తించాలి.

చనుమొనలు పగలడం (డ్యామేజ్డ్ నిపుల్స్)

తల్లి రొమ్ముల నుండి పాలతో పాటు రక్తం ఎరుపు, ఆరంజ్ మరియు గులాబీ రంగులలో వస్తుంటుంది. రొమ్ము ముందు భాగంలో ఉండే చనుమొనలు పగలినప్పుడు లేదా చీలినప్పుడు రక్తం వస్తుంటుంది. బిడ్డ పాలు తాగే సమయంలో సరిగ్గా పట్టుకోలేకపోతే అది చనుమొనలపై ప్రభావం చూపి నొప్పి, రక్తం వస్తాయి.

రస్టీ పైప్ సిండ్రోమ్

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి వక్షోజాల వద్ద రక్తప్రవాహం ఎక్కువగా ఉండి, బిడ్డకు పాలిచ్చేందుకు సహకరిస్తుంది. ఇటువంటప్పుడు పాల రంగు మారి, పాలతో పాటు రక్తం బయటకు వస్తుంటుంది. ముదురురంగులో లేదా బ్రౌన్ కలర్ లో ఈ రక్తం ఉంటుంది.

మస్తిటిస్

ఈ ఇన్ఫెక్షన్స్ తో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రొమ్ములు గడ్డలు కట్టి వాపు అవ్వడం లేదా రొమ్ముల వద్ద కలిగే ఇన్ఫెక్షన్స్ నే మస్తిటిస్ అంటారు. బిగుతైన దుస్తులు ధరించడం, రొమ్ము భాగం శుభ్రంగా లేకపోవడం ఇందుకు కారణం. ఇలాంటి సమయాలలో రక్తం పాలతో వస్తుంటుంది.

రొమ్ము రక్తనాళాలు

రొమ్ము రక్తనాళాలు పగిలినప్పుడు లేదా చీలినప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వెంటనే పాలతో పాటు రక్తం వస్తుంది. చనుమొనలు వంపు తిరిగినప్పుడు రక్తం బయటకు వస్తుంటుంది.

రక్తం పాలు బిడ్డ తాగడం ప్రమాదమా?

పాలతో పాటు రక్తం రావడం కొన్నిసార్లు సహజమే అని వైద్యులు చెబుతున్నారు. రక్తం కొన్నిసార్లు పాలతో పాటు తెలియకుండా పోతుంది. అయితే తరచూ ఈ విధంగా వెంటనే తల్లీ బిడ్డ డాక్టర్ ను సంప్రదించడం చేయాలి. ఎందుకంటే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వలన ఈ విధంగా జరగవచ్చని అంటున్నారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: