తెలుగు అమ్మలు మాత్రమే పిల్లల కోసం చేయగల 5 పనులు

ఒక్క తల్లి దగ్గర మాత్రమే ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ దక్కుతుంది. అది ఏ దేశమైనా, ఏ భాషైనా సరే. అయితే మిగతా అమ్మలతో పోల్చితే మాత్రం ఇక్కడ చెప్పుకునే విషయాలలో మాత్రం తెలుగు అమ్మలు మాత్రమే చేయగలరు అనేలా చేస్తారు. ఇందులో వీరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.  ఇంతకీ ఆ 5 విషయాలు ఏంటో మీరే చూడండి.

ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ ఒక్క తల్లి దగ్గర మాత్రమే దొరుకుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మన తెలుగు  అమ్మలు మాత్రం ప్రేమను పంచడంలో అందరికీ కన్నా ఉన్నతస్థానంలో ఉన్నారు. పిల్లలు ఒక శాతం కోరుకుంటే వంద శాతం ప్రేమను అందిస్తున్నారు.

కమ్మనైన ఆహారం

మంచి ఆహారం అంటే అమ్మ చేతులలోనే వండి, ఆమె ముద్దలు కలిపి తినిపించడమే. అమ్మ చేతి వంటలో ఉండే మహత్యమో ఏమో గానీ ఎన్ని రకాల రుచులను ఎక్కడ చూసినా చివరికి అమ్మ వంటను మించలేవు. కానీ మన తెలుగు అమ్మలు మాత్రం కడుపునిండా తిన్నా కూడా ఇంకా తిను అని ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తారు.

పెంచడం

అందరు తల్లులు తమ బిడ్డను ఒకే విధంగా పెంచితే అందరూ ఉత్తమంగానే ఉంటారు. తల్లి అలానే పెంచినా పిల్లలు తప్పుదారి పడితే అది అమ్మ తప్పు కాదు. అయితే తెలుగు అమ్మలు మాత్రం నువ్వు ఉన్నత స్థానానికి వెళ్లకపోయిన ఫర్వాలేదు కానీ ఎవరినీ మోసం చేయకు, ఇతరులకు సహాయం చేయంటూ ఎప్పుడూ మంచి మాటలే చెబుతుంటారు.

తట్టుకోలేరు

బిడ్డకు ఏం జరిగినా ఏ తల్లీ తట్టుకోలేదు నిజమే. అయితే తెలుగు అమ్మలు మాత్రం బిడ్డకు ఏదైనా చిన్న ఆపద వచ్చినా, ఆరోగ్యం బాగోలేదని తెలిసినా వారి కంటిమీద కునుకుండదు, కనీసం పచ్చి మంచి నీరు కూడా ముట్టుకోలేరు. బిడ్డకు బాగుండేవరకు విలవిల్లాడిపోతారు.

అనురాగం, ఆప్యాయత

తల్లికీ, బిడ్డకు మధ్య అనుబంధం, ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఎంత బాగా వర్ణించినా ఇంకా ఏదో తక్కువే ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే వారి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను కేవలం తమ పిల్లలకే పంచకుండా పిల్లల స్నేహితులకు కూడా పంచగలిగే గొప్ప హృదయం తెలుగు అమ్మల సొంతం.

ఇలా మీరు కూడా చేస్తున్నట్లయితే తప్పకుండా SHARE చేయండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

అప్పుడే పుట్టిన పిల్లల బొడ్డు తాడు వెంటనే కత్తిరించకూడదు!!

Leave a Reply

%d bloggers like this: