పాలు తాగుతూ పిల్లలు నిద్రపోతే ప్రమాదమా..! ఇలాంటప్పుడు ఏం చేయాలి

పాలు తాగే పిల్లలు పాలు తాగుతూనే రొమ్ముల వద్ద నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలా జరిగితే ఏమైనా ప్రమాదమా? అని చాలామంది తల్లులు  భయపడుతూ ఉంటారు. అసలు ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

పిల్లలు పాలు తాగుతూ నిద్రపోవడానికి కారణాలు?

రొమ్ముల వద్ద పాలు తాగుతూ పిల్లలు ఉన్నట్లుండి నిద్రపోతున్నారంటే తల్లి వద్ద తమకు కావలసిన పాలు లేక అలసిపోయి నిద్రపోవడం,  రొమ్ముల వద్ద ఎంత ప్రయత్నించినా పాలు రాకపోవడం అంటే రొమ్ములు గట్టిగా ఉండటం వలన, కొన్నిసార్లు కడుపునిండడంతో నిద్రపోతుంటారు.

టైం చూస్తూ ఉండండి

కొత్తగా తల్లి అయినవారిలో పిల్లలు పాలు తాగడానికి కొంచెం ఎక్కువ సమయమే పుడుతుంది. రొమ్ము పాలు రావడం కూడా ఆలస్యంగానే ఉంటుంది. సాధారణంగా పిల్లలు 5 నిముషాలలో పాలు తాగుతారు, మరికొందరు 20 నిముషాలు తీసుకుంటూ ఉంటారు. అందుకని వారు పాలు ఎంత సేపు తాగుతున్నారు అనే టైం పెట్టుకోవడం వలన మీకు సులభంగా అర్థమవుతుంది బిడ్డకు సరిపడా పాలు ఉన్నాయా? లేవా? అని..

కళ్ళు తెరుస్తారు

తన కడుపుకు సరిపడా పాలు లేవని బిడ్డ తల్లితో ఎలా చెబుతాడంటే కళ్ళు పెద్దవిగా చేసి, బయటకు తొంగిచూడటం లేదా రొమ్ము ముందు భాగాలను నోట్లో ఉంచుకుని నిద్రపోతాడు.

తల్లి ఎలా తెలుసుకోవాలి?

బిడ్డ నిద్రపోతుందని, సరిపడా పాలు లేవని తల్లి ఎలా తెలుసుకోవాలంటే రొమ్ములు మృదువుగా ఉంటాయి మరియు రొమ్ము చివరి భాగం చాలా చిన్నవిగా అవటం జరుగుతుంది.

బరువు తగ్గుతారు

పిల్లలు పాలు తాగేటప్పుడు తరచూ నిద్రిస్తుంటే తల్లి దగ్గర సరిపడా పాలు లేవని గుర్తించాలి. అందుకు సరిపడా పౌషకాహారం తీసుకోవడం చేయాలి. లేకపోతే బిడ్డ బరువు క్రమంగా తగ్గుతుంది.

పిల్లల ముఖం చెబుతుంది

పిల్లలు ఆకలితో నిద్రపోయారా? పాలు తాగుతూ సాధారణంగా నిద్రపోయారా? అనేది తెలుసుకోవచ్చు. చేతులు రెండు ఫ్రీగా వదిలేసి నిద్రపోతుంటే పాలు సరిపోయానని. అదే రెండు చేతులు పిడికిలి బిగించినట్లుగా ఉంటే ఆకలితో ఉందని గ్రహించాలి.

బిడ్డకు ప్రమాదమా?

తల్లి రొమ్ము పాలు తాగుతూ బిడ్డ నిద్రించడం ప్రమాదమేమీ కాకపోయినా పాలు సరిగ్గా అందకపోతే పిల్లల ఆరోగ్యంలో మార్పులు, బరువు తగ్గడం, నీరసంగా ఉండటం జరుగుతుంది. నిద్రపోయినప్పుడు మెల్లగా ఉయ్యాలలో వెయ్యడం చేయాలి.

 ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ ఫీడింగ్: పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: