ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం మంచిదేనా? కడుపులో బిడ్డకు ఏమవుతుంది..!!

గర్భంతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరమా? అని ఒక మహిళ అడిగిన ప్రశ్నకు ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు ఎప్పుడు తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? పుట్టబోయే బిడ్డపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయాలు తెలుసుకోండి. తెలియనివారికి చెప్పండి.

కుంకుమపువ్వు తీసుకోవడం మంచిదేనా?

ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం మంచిదేనా అంటే మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. గర్భవతిగా ఉన్నపుడు రెండో నెల నుండి ఐదో నెల వరకు వాంతులు, వేవిళ్ల కారణంగా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకని పాలలో కుంకుమపువ్వు కలిపి ఇవ్వడం వలన  ఇష్టంగా తాగుతారు మరియు ఇది ఆకలిని పెంచుతుంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు అస్సలు చేయకూడని మరియు చేయాల్సిన 14 పనులు ఇవే..

కుంకుమపువ్వు తీసుకోమనడానికి కారణాలు – ఉపయోగాలు

జీర్ణవ్యవస్థ శుభ్రపరిచి ఆకలిని పెంచుతుంది. మహిళల మనస్సు గర్భం సమయంలో సరిగ్గా ఉండదు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన వారి మనస్సు నిర్దిష్టంగా ఉంటుంది. అలాగే రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. కడుపునొప్పిని తగ్గించి పాల ఉత్పత్తిని పెంచుతుంది. మంచి గాఢ నిద్రను కలిగిస్తుంది. దృష్టి లోపం లేకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి కాలేయ మూత్రపిండాల సమస్యలు రాకుండా చేస్తుంది.

గర్భంతో ఉన్నప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలి?

ఇది ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన విషయం. ఎక్కువ మోతాదులో కుంకుమపువ్వు తీసుకోవడం వలన గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందుకని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ వేడిపాలలో చిటికెడు (10 గ్రాములకు మించకుండా) కలిపి తీసుకోవాలి. రెండవ నెల నుండి కుంకుమపువ్వును తీసుకోవచ్చని నిపుణులు, పెద్దవాళ్ళు చెబుతున్నారు. కుంకుమపువ్వు తీసుకునేముందు వైద్యుడిని లేదా పెద్దలను సంప్రదించి వాడటం మంచిది.

చాలా డేంజర్

ప్రస్తుతం మార్కెట్ లో నాసిరకం కుంకుమపువ్వు దొరుకుతున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు అందంగా, ఎర్రగా పుడతారని అందుకే కుంకుమపువ్వు తీసుకోవాలని అంటుంటారు. అది అపోహ మాత్రమే అని, పిల్లలు పుట్టడం అనేది తల్లితండ్రుల జీన్స్ పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు .

ఏది ఏమైనా గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు తగిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యకరమో కాబట్టి ఏమైనా అపోహలు అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

ప్రసవం తర్వాత రోగనిరోధక శక్తిని వెంటనే పెంచే 9 మార్గాలు!!

Leave a Reply

%d bloggers like this: