మీకు గర్భం రాకుండా చేసే 5 ఆహారాలు : వీటికి దూరంగా ఉండండి…

మీరు మీ వారు కలిసి ప్రేగ్నన్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.  ముఖ్యంగా ఆహరం విషయంలో.  మీరు తీసుకునే కొన్ని ఆహారాలు మీకు తెలియకుండానే మీకు గర్భం రాకుండా చేస్తాయి.. అలాంటి ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో చూడండి…

1. సముద్ర చేపలు

మీరు చేపలు ఎక్కువగా తింటారా? ప్రెగ్నన్సీ ప్లాన్ చేసుకునే సమయంలో కొంచెం తగ్గించాలి. అయితే అన్ని చేపలను కాదు. కొన్ని రకాల సముద్ర చేపలను మాత్రమే. వీటిలో అధికంగా ఉండే, మెర్క్యూరీ మీకు గర్భం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ట్యూనా ఫిష్ లో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. దానిని ఈ సమయంలో తినక పోవడం మంచింది.

2. కూల్ డ్రింకులు

కూల్ డ్రింకులు లేదా చక్కర అధికంగా ఉండే ఏ రకమైన పానీయాలైన, వాటికి దూరంగా ఉండండి. అవి మీ రక్తంలో చక్కర శాతాన్ని పెంచుతాయి. దీని మీ సంతాన అవకాశాలను తగ్గిస్తుంది. అందుకే ఈ సమయంలో చక్కర తక్కువగా తీసుకోండి.

3. కెఫిన్

మీకు రోజు ఉదయం కాఫీ తీసుకోవడం అలవాటా? పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ తీసుకునే కాఫీ శాతాన్ని తగ్గించండి. ఇది గర్భం రావడాన్ని ఆపదు కానీ, గర్భం వచ్చాక నియంత్రిస్తుంది.

4. ట్రాన్స్ ఫ్యాట్స్

చిప్స్, మైక్రో వేవ్ పాప్ కార్న్, ఫ్రైడ్ ఫుడ్స్, లాంటి ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపులో మంట కలిగిస్తాయి. అంతే కాకుండా రక్త నాళాలను దెబ్బ తీసి, పునరుత్పత్తికి అవసరమయ్యే పోషకాలను అందకుండా నిరోధిస్తాయి.

5. సరిగా ఉడకని మాంసం 

మాంసం ద్వారా మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందుతాయి. కానీ సరిగా ఉడకని  మాంసంలో ఉండే సాల్మొనెల్లా (salmonella), కాలిఫోర్మ్ (coliform) లాంటి బాక్టీరియా మీ గర్భాశయాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అందుకే ఈ సమయంలో మాంసాన్ని బాగా ఉడికించి తినండి.  

Leave a Reply

%d bloggers like this: