మీ కడుపులో ఉన్నది ఆడ మగ అని తెలుసుకోవడానికి 10 సులువైన మార్గాలు

గర్భం పొందిన తర్వాత తమకు బాబు పుడతాడా/పాప పుడుతుందా అని ప్రతి దంపతులకు తెలుసుకోవాలని ఉంటుంది.  ఇంటి దగ్గరే చెక్ చేసుకుని పరీక్షల ద్వారా ఈ విషయాల గురించి మీరే చాలానే తెలుసుకుని ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకునే సరదా మార్గాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది ఎవరినీ నొప్పించాలని కాదు కేవలం మీకు సమాచారాన్ని అందించాలన్నదే మా ఉద్దేశం. ఇంతకీ ఆ సరదా మార్గాలేంటో మీరే చూడండి.

గుండె స్పందన

మీ కడుపులోని శిశువు గుండె స్పందన నిముషానికి 150 సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు లబ్ డబ్ అనే శబ్దం  చేస్తుంటే మీకు పుట్టబోయేది అమ్మాయి, 150 సార్ల కంటే తక్కువగా ఉంటే బాబు పుట్టబోతున్నట్లు.

మీ గర్భం సైజును బట్టి

మీ గర్భం ఎక్కువ లావుగా ఉంటే మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తున్నట్లు, గర్భం సాధారణగా లేదా తక్కువగా ఉంటే అబ్బాయి పుట్టబోతున్నట్లు.

స్వీట్స్, పుల్లని పదార్థాలు తింటుంటే

గర్భం సమయంలో మీరు ఎక్కువగా తింటుంటే పాప పుడుతుందని, అదే పుల్లని పదార్థాలు తినడం చేస్తుంటే బాబు పుట్టబోతున్నట్లు.

మీ చర్మ సౌందర్యాన్ని బట్టి

మీకు పుట్టబోయేది బాబా/పాప అనేది మీ శరీరం చెబుతుంది. గర్భంతో ఉన్నప్పుడు ప్రకాశవంతంగా లేకుండా ఉంటే అమ్మాయి పుట్టబోతున్నట్లు, అదే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటే అబ్బాయి మీ జీవితంలోకి వస్తున్నట్లు.

ఉదయం నిద్రలేచిన తర్వాత

ఉదయం నిద్రలేచిన వెంటనే వికారంగా ఉండటం, నీరసం మొదటి మూడు నెలలలో జరుగుతుంటే అమ్మాయి అని, డల్ గా లేకుండా ఉదయం నిద్రలేచినప్పుడు ఆక్టివ్ గానే ఉంటుంటే బాబు జన్మిస్తున్నట్లు.

మీ చేతులను బట్టి

గర్భంతో ఉన్నప్పుడు మీ చేతులు సున్నితంగా మృదువుగా ఉంటే అమ్మాయికి జన్మనిస్తున్నట్లు, అదే మీ చేతులు పొడిగా ఉంటే మాత్రం బాబు పుడతాడని చెబుతున్నారు.

నిద్రించే పొజిషన్ ప్రకారం

మీరు నిద్రించే పొజిషన్ మీకు అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడుతుందా అని చెబుతుంది. మీరు ఎక్కువగా కుడివైపు తిరిగి పడుకున్నట్లయితే అమ్మాయి పుడుతుందని, అదే ఎడమవైపు తిరిగి పడుకుంటే మాత్రం అబ్బాయి అని గుర్తుపెట్టుకోండి.

వికృతమైన లేదా సొగసైన

గర్భం సమయంలో మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నా బయటకు మాత్రం ఎంతో ధైర్యంగా ఉంటున్నట్లయితే బాబు పుడుతున్నట్లు, అదే సొగసుగా ఉంటే మాత్రం అమ్మాయి మీ అందమైన జీవితంలోకి వస్తున్నట్లు.

చైనీస్ క్యాలెండర్

చైనీస్ క్యాలెండర్ ప్రకారం తల్లి వయస్సు మరియు ఆమె యొక్క నెలవారీ భావనను పరిగణలోకి తీసుకుని శిశువు లింగాన్ని తెలుపుతారు.

మాయన్ లింగ నిర్ధారణ

ఇది కూడా చైనీస్ క్యాలెండర్ లాంటిదే కానీ తల్లి వయస్సు మరియు గర్భం పొందిన సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుని రెండు బేసి లేదా సరి సంఖ్యలు వస్తే అమ్మాయి పుట్టబోతున్నట్లు, ఒకటి సరి లేదా బేసి వస్తే బాబు పుడుతున్నట్లు నిర్ధారణ చేస్తారు.

మీ మూడ్ తెలుపుతుంది

గర్భం సమయంలో డల్ గా, మూడీగా ఉన్నట్లయితే మీ ఇంట్లోకి అమ్మాయి వస్తున్నట్లు. ఇలా మొదటి మూడు నెలలలోనే తెలుసుకోవచ్చు. మూడీగా లేకపోతే మాత్రం అబ్బాయి పుట్టబోతున్నట్లు.

మీకు నిద్రలో వచ్చే కలల ప్రకారం

మీకు నిద్రలో లేదా ఎప్పుడూ బాబు పుట్టబోతున్నాడు అని కలలు వస్తుంటే మీ నమ్మకమే నిజమవుతుంది.

మీ పిల్లలు ఊహించగలరు

మీ పిల్లలు మీ కడుపు గురించి చాలా ఆసక్తికరంగా ఉంటే మీకు అమ్మాయి పుట్టబోతుందని, లేదంటే అబ్బాయి జన్మిస్తున్నట్లు.

కడుపును తాకే విధానాన్ని బట్టి

మీ గర్భంపైన బొడ్డుపై తాకుతూ ఉంటే అమ్మాయి అని, అదే పక్కటెముకల చుట్టూ తాకుతుంటే అబ్బాయి అని గుర్తించాలి.

ఇవన్నీ మన అమ్మమ్మల వయస్సు ఉన్నవారు చెప్పిన విషయాలు. ఇవి నిజమా కాదా అనేదాని కన్నా మీకు సమాచారం ఇవ్వడానికి, సరదాకు అని మాత్రమే గ్రహించండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా,  ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

అప్పుడే పుట్టిన పిల్లల బొడ్డు తాడు వెంటనే కత్తిరించకూడదు!!

Leave a Reply

%d bloggers like this: