మీ భర్త మనసులో మీరు ఎప్పుడు ఉంటారు!! అని చెప్పడానికి ఇవే 5 గుర్తులు

తన భర్త తనను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలని ప్రతి భార్య కోరుకుంటుంది. దంపతుల మధ్య ప్రేమను ఒకరికి ఒకరు తెలుపుకునే సంఘటనలు చాలా  తక్కువ ఉంటాయి. మీ ఆయనకు మీ మీద ఎంత ప్రేమ ఉన్నా, అన్ని సందర్భాల్లో బయట పడక పోవచ్చు.  అతను మీ గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తున్నా, అది మీకు తెలియక పోవచ్చు. కానీ తెలుకోడానికి కొని గుర్తులు వున్నాయి… అవేంటో చూడండి..

1. రోజు మీకు మెసేజ్ చేస్తాడు

ఈ రోజుల్లో వ్యక్తుల మధ్య మాటల కన్నా మెసేజ్ లే ఎక్కువ నడుస్తున్నాయి. తమ భావాన్ని వ్యక్త పరచాడనికి చాలా మంది మెసేజింగ్ ను ఎంచుకుంటారు. మీ ఆయన కూడా, ఉదయం ఆఫీస్ కి వెళ్ళి, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు… జరిగే ప్రతి చిన్న విషయాన్నీ మీకు మెసేజ్ చేస్తుంటాడా? అయితే  మీరు మీ ఆయన మనసులో ఎప్పుడు ఉంటారు.

2. సర్ప్రైజస్

మీరు ఇంతక ముందు ఎప్పుడో మాటల సందర్భంలో, ఏదైనా వస్తువు గురించి మీరు ఇష్టంగా మాట్లాడడం గుర్తించుకుని. మీకోసం దానిని మీ బర్త్ డే కోసమో, పెళ్ళి రోజు కోసమో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు కదూ. ఇదంతా మీరు తన మనసులో లేకుండా చేయలేడు.

3. తనే మొదలుపెడుతాడు

మీ మధ్య కొన్ని సందర్భల్లో మాటలు అన్ని అయిపోయి, ఇక మాట్లాడుకోడానికి ఏ విషయాలు లేనప్పుడు. మీ ఆయనే కల్పించుకొని మీతో మాటలు కొనసాగించడానికి ఏదో ఒక విషయాన్నీ తీసుకొస్తాడు.

4. అన్ని మిమ్మల్నే గుర్తుచేస్తాయి

మీ ఇద్దరు ఒకరిని ఒకరు మొదటి సారి కలిసిన రోజు నుండి ఈ క్షణం వరకు, మీ మధ్య జరిగిన ప్రతి విషయాన్నీ గుర్తించుకుంటాడు. మీరు మొదటి సారి కలిసి వెళ్ళిన ప్రదేశం, కొన్న వస్తువు ఏదైనా సరే అది తనకు మిమ్మల్ని గుర్తుచేస్తుంది.

5. నవ్విస్తుంటాడు

మిమ్మల్ని నవ్వించడం అంటే తనకు ఇష్టంగా ఉంటుంది. మిమ్మల్ని నవ్వించడం కోసం ఏదైనా చేస్తాడు. ఏదో ఒక విషయాన్ని మీకు నవ్వు తెప్పించేలా మారుస్తాడు.  మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు, మీ కోపాన్ని తగ్గించి, మిమ్మల్ని నవ్వించడం తనకు మాత్రమే తెలుసు.  

Leave a Reply

%d bloggers like this: