సన్నగా ఉండే పిల్లల బరువు పెంచడానికి తినిపించాల్సిన అద్భుతమైన ఆహారాలు : తప్పక అవసరం

మీ పిల్లలు మరి సన్నగా ఉన్నారా? దానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా,  ఎన్ని రకాల ఆహారాలు తినిపించినా  కూడా బరువు పెరగడం లేదా? అందుకే మీ పిల్లల బరువును తప్పకుండా పెంచే 10 ఆహారాలేంటో తెలుసుకోండి…

1. వెన్న

సన్నగా ఉండే పిల్లలకు కావాల్సిన కొవ్వులు వెన్నలో పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ పిల్లలు బరువు పెంచాలి అనుకుంటే, వెన్నను మీ పిల్లల ఆహారంలో చేర్చండి. పప్పు అన్నం తో కలిపి తినిపించండి. పిల్లలు బరువు పెరగడానికి కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి.

2. పీ నట్ బట్టర్ 

ఇప్పుడు అన్ని సూపర్ మర్కెట్స్ లో పీ నట్ బట్టర్ సులుభంగా దొరుకుతుంది. మీ పిల్లల కోసం దీనిని తప్పకుండా వాడండి. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా, బ్రేడ్ తో పాటు పీ నట్ బట్టర్ ఇవ్వండి. ఆల్మండ్ బట్టర్ (Almond butter) కూడా అలానే పిల్లలకు ఇవ్వచ్చు.

3. పాలు

పాలు లో అనేక పోషకాలు ఉంటాయి. పిల్లల బరువు పెరగడం కోసం అవసరమయ్యే కార్భోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉంటాయి. మీ పిల్లలు బరువు పెరగాలంటే తప్పకుండా రోజుకు రెండు సార్లు పాలు తాగేలా చూడండి. ఒకేవేళ పాలు తాగడం ఇష్టపడకపోతే మిల్క్ షేక్స్ ఇవ్వండి.

4. గుడ్లు

గుడ్లు ప్రొటీన్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. 100 గ్రా గుడ్లలలో 13గ్రా ప్రోటీన్లు ఉంటాయి. అంతే పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు కావాల్సిన విటమిన్ ‘ఏ’ మరియు విటమిన్ ‘బి12’ కూడా ఉంటాయి. మీ పిల్లలు రోజు తినే ఆహారంలో గుడ్లను వివిధ రకాలుగా ఇవ్వచ్చు. తప్పకుండా రోజుకు ఒక గుడ్డు తినిపించండి.

5. అరటి పండ్లు

అందరిలో ఇళ్ళల్లో తరచుగా వుండే అరటిపండ్లతో మీ పిల్లల బరువు పెంచవచ్చు. 1 అరటి పండులో 105 క్యాలోరీల శక్తి ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన కొవ్వును అందించడానికి, అరటి పండ్లలో పుష్కలంగా కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. పిల్లలకు అరటి పండ్లను, మిల్క్ షేక్స్ తో , పుడ్డింగ్స్ తో వివిధ రకాలు తినిపించవచ్చు.

6. చికెన్

కండరాల నిర్మాణానికి ముఖ్యమైన అవసరం ప్రోటీన్లు. అవి ఎక్కువగా కలిగి వుండే చికెన్ సన్నగా ఉండే పిల్లలకు ఒక చక్కని ఆహరం. పిల్లలకు నూనె,మసాలాలు లేకుండా చికెన్ తినిపించండి. తప్పకుండా బరువు పెరుగుతారు.

7. ఆలు

సన్నగా ఉండే మీ పిల్లలు బరువు పెరగాలంటే వారు తీసుకునే ఆహారంలో 40% కార్భోహైడ్రేట్స్ ఉండాలి.  అందుకోసం ఆలు ఒక మంచి ఎంపిక. ఇందులో ఉండే అర్జినైన్, గ్లుటమైన్ అనే ఎమినో ఆసిడ్స్, పిల్లలు బరువు పెరగడానికి సహాయపడుతాయి. 

Leave a Reply

%d bloggers like this: