సిజేరియన్ తర్వాత మీ కడుపుపడే అవస్థలు : తప్పించుకోవాలంటే ఇవి తెలుసుకోండి

గర్భం పొందటం మహిళకు దక్కిన గొప్ప వరమైతే ప్రస్తుత రోజుల్లో చాలామందిలో సహజకాన్పు  కన్నా సిజేరియన్ ఎక్కువగా జరుగుతున్నాయి.  సిజేరియన్ కన్నా సహజకాన్పు జరగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే సిజేరియన్ ప్రభావం ప్రసవం తర్వాత మహిళ కడుపుపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుందో తెలుసుకుందాం…

కడుపును తొలగించాలి

తొమ్మిది నెలల పాటు బిడ్డను కడుపులో భద్రంగా మోసిన తర్వాత మరికొన్ని గంటలలో ప్రసవం జరుగుతుందనగా సహజకాన్పు కష్టం అని చెబుతారు. అటువంటప్పుడు తల్లి కడుపును కోసి బిడ్డను తొలగించాల్సి ఉంటుంది. ఆ సమయానికి తల్లికి ఏమీ తెలియకపోయినా ఆ తర్వాత చాలా బాధగా ఉంటుంది.

కడుపుపై కుట్లు నొప్పిని కలిగిస్తాయి

సిజేరియన్ తర్వాత కడుపుపై పడిన కుట్లు కొన్నిసార్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. నొప్పిని కలిగించడమే  కాకుండా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. సిజేరియన్ డెలివరీలో కణజాలం కట్ అయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.

6 నెలల వరకు

సిజేరియన్ తర్వాత కడుపుపై ఒత్తిడి తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా సరే చాలామంది మహిళలకు ఇది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సిజేరియన్ కుట్ల వద్ద ఎటువంటి బ్లీడింగ్ రాకుండా మళ్ళీ యధావిధిగా రావడానికి 6 నెలల సమయం పడుతుంది.

పొత్తి కడుపుపై ప్రభావం

సాధారణంగా సిజేరియన్ సమయంలో బిడ్డను బయటకు తీసేటప్పుడు కత్తిరించిన కణజాలం సిజేరియన్ భాగంలో లేకపోతే పొత్తికడుపుపై ప్రభావం చూపెడుతోంది.

6 నెలల తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకోవాలి

కొందరిలో ఆరు నెలలు గడిచినా కూడా కుట్లు సరిగ్గా సెట్ కాకపోవడం, ఇంకా పచ్చిగా గాయంగానే ఉన్నట్లు, కడుపులో నొప్పిగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలి.

ఏది ఏమైనా సాధారణ కాన్పు కన్నా సిజేరియన్ డెలివరీ జరిగిన మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

పెళ్ళి అయిన తర్వాత మీ అమ్మని మిస్ అయ్యే 10 సందర్భాలు

Leave a Reply

%d bloggers like this: