అందమైన తెలివైన పిల్లలు పుట్టడానికి 5 చిట్కాలు ఫాలో అవ్వండి

స్త్రీ జీవితం మాతృత్వంతో సంపూర్ణమవుతుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళా తాను తల్లి కావాలని ఏ విధంగా  అయితే తనకు పుట్టబోయే బిడ్డలు కూడా  తెలివిగా అందంగా పుట్టాలని కోరుకుంటుంది. మరి అలా పుట్టాలంటే మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఏంటి? చేయకూడనివి ఏంటో తెలుసుకోండి..

ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్స్

పిల్లలు తెలివిగా పుట్టాలంటే గర్భధారణకు నాలుగు వారాల ముందు మరియు గర్భధారణ ఎనిమిది వారాల తర్వాత ఫోలిక్  యాసిడ్, విటమిన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు కణలు ఏర్పడటానికి సహాయపడతాయి. కాయ ధాన్యాలు మరియు పచ్చి కూరగాయలు, తృణధాన్యాలలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది. ఫోలిక్ యాసిడ్ తో విటమిన్ బి 12, విటమిన్ సి ఆహారాన్ని తీసుకోవడం వలన ఎర్ర రక్తకణాల అభివృద్ధికి, ఎముకలు ఏర్పడటానికి సహాయపడుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు

ఈ ఆహారం బిడ్డ నాడీ అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే జన్మించే సమయంలో బిడ్డ బరువు ఈ ఆహారంపై ఆధారపడి ఉంటుంది. గుడ్లు, బీన్స్, రెడ్ మీట్, మెర్క్యూరీ తక్కువగా ఉన్న చేపలు, తృణ ధాన్యాలు, పాలకూర, అవిసె గింజలు మరియు ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

పండ్లు మరియు కూరగాయలు

మీ ఆరోగ్యంతో పాటు మీకు పుట్టబోయే ఆరోగ్యాన్ని, మెదడు పనితీరు బాగా పనిచేసేలా కొన్ని యాంటీఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా పండ్లు, కూరగాయలలో బాగా లభిస్తాయి. పచ్చ ఆకుకూరలు, బ్లూ బెర్రీస్, టమోటోలలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.

బిడ్డకు ఆక్సిజన్ ఇచ్చే ఆహారం

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన బిడ్డకు ఆక్సిజన్ ను బాగా సరఫరా చేస్తాయి. అందుకని ఐరన్ అధిక ఎక్కువగా ఉండే బీట్ రూట్, చికెన్, బచ్చలి కూర, చిక్కుడు కాయలు, తృణధాన్యాలు బాగా తీసుకోవాలి.

వీటిని అస్సలు తీసుకోకూడదు

మీకు పుట్టబోయే ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా పుట్టాలంటే మద్యం, ధూమపానం అస్సలు చేయకూడదు. అలాగే ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం మీకు, మీ బిడ్డకు మంచిది కాదు. ఇక ఆహారం విషయానికొస్తే మెర్క్యూరీ అధికంగా ఉండే కొన్ని రకాల చే పలు మార్కెట్ లో ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి. మెర్క్యూరీ తక్కువగా ఉండే చేపలను వారానికి రెండుసార్లు తినడం చేయాలి.

గర్భంతో ఉన్నప్పుడు అలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ మీ బిడ్డ తెలివిగా, అందంగా పుట్టాలంటే ఈ ఆహారాలు తీసుకోమని చాలా తక్కువగా చెబుతుంటారు. సో,అందరికీ తెలియజేయండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి.

బలమైన ఎముకల కోసం మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన 6 ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: