అప్పుడే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 వస్తువులు పిల్లల కోసం తీసుకోవాలి

మీరు కొత్తగా తల్లి అయిన తర్వాత మీరు కొనే వస్తువుల జాబితా కూడా మారిపోతుంది. మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా మీ బాబును, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు తల్లి అయిన తర్వాత కొనే వస్తువులకు సంబంధించి కొంత జాబితా ఉంది. అవేంటంటే,

డైపర్స్

బేబీ పుట్టిన కొన్ని వారాల నుండి డైపర్ కచ్చితంగా వాడాల్సి వస్తుంది. అయితే మీ బిడ్డకు సరిపోయే, దురద రానటువంటి డైపర్ కొనడం  అంటే కత్తి మీద సామే. అందుకే, మీరు ప్రతి బ్రాండ్ డైపర్ కొని ఏది మీ బేబీకి సరిపోతుందో చూసుకొని, తర్వాత దానినే కొనసాగించాలి.

బేబీ వైప్స్

బేబీ వైప్స్‌తో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాప శరీరాన్ని తుడవవచ్చు. కాబట్టి మీరు బేబీ వైప్స్‌ను సమృద్ధిగా నిల్వ ఉంచుకోవాలి. బేబీ కాళ్ళు, చేతులు, మొహాన్ని శుభ్రపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల బేబీ శరీరం మీద ఉన్న జెంస్ చంపబడుతాయి.

స్టోలర్స్

ఈ స్టోలర్స్ మీ బేబీని సూర్యుని నుండి వచ్చే కిరణాల నుండి రక్షిస్తాయి. అయితే వీటిని లేకుండా కొనడం చాలా కష్టం.  కాబట్టి, రెండు బ్రాండ్లు చూసి ఏది మంచిదనిపిస్తే దాన్నే కొనసాగించేలా ప్లాన్ చేసుకోండి.

మొబైల్ మానిటర్

మీకు ఎప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే పాప గుర్తుకు వస్తుంది. కాబట్టి మీరు మొబైల్ మానిటర్ పాప దగ్గర ఉంచి బయటకు లేదా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. ఇందులో మీ మాటలు వినిపిస్తూ ఉండటం వల్ల మీరు అక్కడే ఉన్న ఫీలింగ్ బేబీకి కలుగుతుంది. దీంతో బేబీ ప్రశాంతంగా నిద్రపోతుంది.

నిపిల్ క్రీమ్

మీరు బిడ్డకు పాలిచ్చే క్రమంలో మీ నిపిల్స్ చాలా ఇబ్బంది పడి ఉంటాయి. అవి పొడిగా మారి నిస్సారంగానూ, జీవం లేకుండా అయినట్లు అనిపిస్తాయి. దీని కోసం మీరు నిపిల్ క్రీమ్ కొనాల్సి వస్తుంది. అయితే మీరు కొనే నిపిల్ క్రీం బేబీకి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్త పడండి.

బేబీ టబ్

బేబీ టబ్ వాడటం వల్ల బిడ్డ ఎంత  ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయవచ్చో తెలుస్తుంది. అంతేకాక, పాప స్నానం చేయడానికి కూడా ఇది అనువుగా ఉంటుంది.

బట్టలు

మీరు పాప కోసం వాడే బట్టలు ఇంటిలో ఉండే బట్టలులా కఠినంగా ఉండకూడదు. కాబట్టి, బేబి చర్మానికి సరిపోయే మెత్తటి బట్టలను కొనాలి.  పాప కిందకు, పాప చుట్టూ కూడా మెత్తని బట్టలు ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా బేబీ ఎటువంటి ర్యాషెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Leave a Reply

%d bloggers like this: