ఈ 6 మార్గాల ద్వారా మీ పిల్లలకు సులభంగా క్రమశిక్షణను నేర్పవచ్చు

మీ బిడ్డ క్రమంగా ఎదుగుతుంటారు. అయితే ఈ క్రమంలో మీరు వారి వ్యక్తిత్వం పట్ల కొన్ని ఆంక్షలు పెట్టాల్సి ఉంటుంది. మొక్కై వొంగనిది మానై వొంగునా అన్న సామెత ప్రకారం మీరు మీ పిల్లలను చిన్న వయసు నుండే మంచి క్రమశిక్షణను నేర్పించాలి. అందుకోసం మీరు కొన్ని మార్గాలు అవలంభించాల్సి ఉంటుంది. అవేంటంటే,

పిల్లల్ని కొట్టకండి

పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా కొట్టకండి. వారిని తరచుగా కొడుతూ ఉంటే, వయసు పెరిగే కొద్ది వారికి మీమీద వ్యతిరేకత వస్తుంది. వారిని కొట్టేకన్నా, వీరు చేసిన తప్పు గురించి మాటల్లో వివరించండి. దీని ద్వారా వారు అర్థం చెసుకొనే అవకాశం ఉంది.

మీరు టెంపర్ కోల్పోవద్దు

మీ చిన్నారి మీద మీకు ఎంత కోపం వచ్చినా మీ టెంపర్‌ను కోల్పోకండి. వీలైనంత నెమ్మదిగా చెప్పండి. మీ కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తే వీరు రెబల్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా వ్యవహరించండి.

మంచి నడవడిక

చిన్న పిల్లలు సాధారణంగా వారి తల్లితండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి, మీ మంచి అలవాట్లు వారికి వచ్చేలా, మీ అందమైన వ్యక్తిత్వం వారికి వచ్చేలా తీర్చిదిద్దండి. ఒక్కసారి మంచి అలవాట్లు అలవడితే క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.

మంచిని గుర్తించండి

చిన్న పిల్లలకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు. అందులో కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా మంచి చేస్తే వారి మంచిని మీరు గుర్తించి పొగడండి లేదా బహుమతి ఇవ్వండి. దీని వల్ల ఏది మంచి పనో, ఏది చెడ్డపనో వారికి తెలుస్తుంది.

వారి మీద శ్రద్ధ పెట్టండి

చాలా మంది పిల్లలు చెడిపోవడానికి కారణం వారి తల్లిదండ్రుల పెంపకమే. తల్లిదండ్రులు పిల్లల విషయంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే పిల్లలు అలా తయారవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల మీద తగినంత శ్రద్ధ పెట్టండి. వారు టీనజ్‌కు వచ్చిన తర్వాత మారడం చాఅ కష్టం అని గుర్తించండి.

టైం ఔట్స్

మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే శిక్ష విధించండి. అయితే, మేము చేసింది తప్పు అని వారి చేతనే ఒప్పించేలా అలవాటు చేయండి. అలా ఒప్పుకుంటే ఎటువంటి శిక్ష ఉండదని వారికి చెప్పండి. దీని ద్వార వారికి ఏలాంటి పనులు చేయకూడదో తెలిసి మంచి నడవడిక అలవడుతుంది.

Leave a Reply

%d bloggers like this: