ఏ నెలలో ప్రేగ్నన్ట్ అయితే మీకు, మీ బిడ్డకు మంచిది?

తల్లి అవ్వడం అనేది మహిళలకు కలిగే అత్యంత ఆనందమైన క్షణాలు. అయితే సరైన అవగాహన లేకపోవడం వలన  చాలామంది గర్భం పొందలేక, గర్భం పొందినా మధ్యలోనే గర్భం పోవడం వంటి సమస్యలు చాలా బాధాకరం. అయితే గర్భం పొందడానికి ఏది ఉత్తమమైన సమయం, ఏ నెలలో గర్భం దాల్చితే పుట్టబోయే పిల్లలకు మంచిదో తెలుసుకోండి. అందరికీ తెలియజేయండి.

గర్భం రాకపోవడానికి కారణాలు

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే ఏకాంతంపైనే గర్భం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇలా పాల్గొనే పొజిషన్స్ సరిగ్గా లేనప్పుడు, పురుష కణాలు మహిళ అండంతో కలవనప్పుడు మీరు ఎన్నిసార్లు కలిసి పాల్గొన్నా వృధానే అవుతుంది. అలాగే మహిళలలో 30, 35 ఏళ్ళ తర్వాత గర్భం దాల్చడం చాలావరకు తగ్గిపోతుంది.

గర్భం రావాలంటే ఏం చేయాలి?

ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న అనుమానం. ప్రతి రోజూ తమ భాగస్వామితో కలుస్తున్నా గర్భం రాలేదని అనుకుంటుంటారు. సాధారణంగా ఋతుస్రావం జరుగుతున్న మహిళలలో బహిష్టు అయిన 12 నుండి 14 రోజులలో మహిళల నుండి అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో ఏకాంతంగా కలవడం వలన మగవారి  ఇంద్రియకణాలు , మహిళల అండంతో ఫలదీకరణం చెంది పిండం ఏర్పడేలా చేస్తాయి.

గర్భం దాల్చడానికి ఉదయం ఇలా..

పైన చెప్పుకున్నట్లు మహిళలలో అండం విడుదల అయిన సమయంలో ఏకాంతంగా పాల్గొంటే గర్భం పొందడానికి ఉపయోగపడుతుంది. అయితే రాత్రిళ్ళు కలవడంకన్నా ఉదయం ఏకాంతంగా కలిస్తే  మగవారి నుండి ఎక్కువ సంఖ్యలో ఇంద్రియకణాలు ఉత్పత్తి అయి, మహిళల అండంతో ఫలదీకరణం చెందుతాయి.

బిడ్డకు జన్మనివ్వడానికి ఏ నెల మంచిది?

జూన్ లేదా ఆగస్టు నెలలలో మీరు గర్భం దాల్చడం వలన మీకు వేసవిలో బిడ్డ జన్మించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో బిడ్డకు జన్మనిచ్చినట్లయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అదే వేసవి సమయంలో జన్మనివ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని  ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా తెలిపారు.

దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి మహిళకు తెలిసేలా SHARE చేయగలరు.

ఇవి కూడా చదవండి. 

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపెడుతుందా?

Leave a Reply

%d bloggers like this: