కన్న తల్లి కూతురికి గర్భసంచి దానం చేసింది..భారతదేశంలో ఇదే మొదటిసారి

అమ్మ నవమాసాలు మనల్ని మోసి జన్మనిస్తుంది. నడక, మాటలు నేర్పి మన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.  మన జీవితంలోని ప్రతి అడుగులో తోడు ఉంటుంది. తన సర్వస్వాన్ని మనకోసం వెచ్చించగలదు. అవసరమైతే ఏమైనా త్యాగం చేయగలదు. ఇప్పుడు మళ్ళి అది రుజువైంది.

ఏమి జరిగింది?

పుణేలో జరిగిన ఈ సంఘటన, భారత దేశంలోనే మొదటి సారి జరిగిన “UTERUS TRANSPLANT- గర్భసంచి మార్పిడి”. 40 ఏళ్ళ తల్లి, పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుట్టిన తన కూతురికి, తన గర్భసంచిని దానం చేసింది. తన కూతురిని పేగు తెంపుకుని కనడం మాత్రమే కాకుండా,  ఆ పేగునే తన కూతురికి తెంచి ఇచ్చింది. దీని ద్వారా తన కూతురు కూడా అమ్మ అవ్వకలదని ఆ తల్లి కోరిక.

ఆపరేషన్ ఎలా జరిగింది?

జరిగిన ఆపరేషన్ గురించి వివరిస్తున్న డాక్టర్ల బృందం

గర్భసంచి మార్పిడి ఆపరేషన్, పూణే గ్యాలక్సీ కేర్ హాస్పిటల్ లో, నిపుణులైన డాక్టర్లు నిర్వహించారు. ఈ మొత్తం ఆపరేషన్ ను పర్వేక్షించిన సీనియర్ డాక్టర్ శైలేష్, ఈ ఆపరేషన్ గురించి ఇలా చెప్పారు.

“ ఇలాంటి ఒక ఆపరేషన్ భారత దేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఆపరేషన్ పూర్తి చేయడానికి 9 గంటలు పట్టింది. ఈ ఆపరేషన్ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్నది. రక్త నాళాలను జాగ్రత్త కలపాలి.  అధునాతన సాంకేతికత తో ఆపరేషన్ పూర్తియు చేసాం. ఒక సంవత్సరం తరువాత, ఆ కూతురి గర్భం దాల్చవచ్చు”

Leave a Reply

%d bloggers like this: