తెల్ల స్ట్రెచ్ మార్క్స్ – ఎర్ర స్ట్రెచ్ మార్క్స్ : మధ్య తేడాలేంటి? ఎందుకొస్తాయి?

స్ట్రెచ్ మార్క్స్, హానికరం కానీ చర్మపు చారలు. వయసు పెరిగే కొద్ది శరీర భాగాల సైజు పెరగడం వలన, చర్మం సాగి, చర్మపు మధ్య పొర అయిన డెర్మిస్ (Dermis) చినిగిపోవడం వలన, ఈ చారలు ఏర్పడుతాయి. సహజంగా ఎదభాగం, తొడలు, పిరుదులు, భుజాలపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ప్రెగ్నన్సీ సమయంలో పొట్ట మీద కూడా ఏర్పడుతాయి. అయితే స్ట్రెచ్ మార్క్స్ శరీరం మీద రెండు రంగుల్లో ఏర్పడుతాయి. ఎరుపు, తెలుపు. ఆ ఎరుపు, తెలుపు స్ట్రెచ్ మార్క్స్ మధ్య తేడాలేంటో,  అవి ఎందుకొస్తాయి ఇక్కడ తెలుసుకుందాం…

ఎరుపు స్ట్రెచ్ మార్క్స్

మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ కొత్తగా ఏర్పడుతుంటే, అవి ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి ఆరంభ దశ. రక్త కణాలు ఈ స్ట్రెచ్ మార్క్స్ ద్వారా కనిపిస్తాయి, అందుకే అవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ దశలో మీరు సరైన క్రీములు వాడితే, స్ట్రెచ్ మర్క్స్ సులువుగా తొలిగిపోతాయి.

తెల్ల స్ట్రెచ్ మార్క్స్

చాలా కాలం నుండి మీ శరీరం పై వున్న స్ట్రెచ్ మార్క్స్, తెలుపు రంగులో ఉంటాయి. కొన్ని సార్లు సిల్వర్ రంగులో కూడా ఉంటాయి.  ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ తో తొలిగించలేము. లేసర్ ట్రీట్మెంట్ తో కొంత వరకు నయం చేయవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: