నార్మల్ డెలివరీలో కూడా కుట్లు ఉంటాయా?

ప్రెగ్నన్సీ తో ఉన్న మహిళలందరు కోరుకునేది తమకు నార్మల్ డెలివరీ జరగాలని.  కానీ నార్మల్ డెలివరీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కుట్లు. అవును నార్మల్ డెలివరీ లో కూడా కుట్లు ఉంటాయి. అందుకు కారణాలు ఏంటో తెలుసుకోండి….

1. గర్భస్థానం 

నార్మల్ డెలివరీలో సహజంగా కుట్ల అవసరం ఉండదు. కాన్పు జరిగేటప్పుడు పవిత్రమైన గర్భస్థాన మార్గం ద్వారా బిడ్డ బయటకు వస్తాడు. అందుకు మీ గర్భస్థాన గోడలను వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ బిడ్డ బయటకు రాడానికి మీరు వెడల్పు చేసిన ఈ మార్గం సరిపోకపోతే, మీ గర్భస్థానం చిన్నగా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఆ చినగడం ఎక్కువగా ఉండచ్చు, ఈ  ద్వారం, మల ద్వారం కలిసి పోయేంత కూడా చినిగిపోవచ్చు. ఈ చినిగిపోయిన ప్రాంతం కుట్లు వేస్తారు.

2. ఎపీసీయోటమి – Episiotomy

ఒక వేళ కడుపులోని బిడ్డ బయటకు రావడానికి మీరు గర్భస్థానం మార్గాన్ని వెడల్పు చేయలేకపోతే.  కాన్పు ముందే ఈ మార్గాన్ని కోత ద్వారా వెడల్పు చేస్తారు. బిడ్డను బయటకు తీసిన తరువాత కుట్లు వేస్తారు.

నార్మల్ డెలివరిలో కుట్లు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. కుట్ల దగ్గర లావెండర్ ఆయిల్ ను పూయండి. కుట్లు త్వరగా మానిపోతాయి.

2. కూర్చోవడానికి ఇబందిగా ఉన్నప్పుడు. మెత్తని దిండు లేదా వాటర్ బాగ్ కుర్చునేటప్పుడు వాడండి.

3. వాపు, నొప్పి ఎక్కువగా ఉంటే ఐస్ క్యూబ్స్ తో ఆ ప్రాంతంలో మర్దన చేసుకోండి.

4. కుట్లను వేడి నీళ్ళతో కడగండి.

5. ఎక్కువుగా నీరు, పీచు పదార్ధాలు ఆహారంగా తీసుకోండి. మలం సులభంగా వస్తుంది.

Leave a Reply

%d bloggers like this: