పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు సూక్ష్మక్రిముల ద్వారా త్వరగా వ్యాపిస్తాయి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నపుడు పచ్చగా లేదా తెల్లగా చిక్కని రూపంలో గళ్ళ (శ్లేష్మం లేదా మ్యూకస్) బయటకు వస్తుంది. కొన్నిసార్లు ఇది గొంతులో అడ్డం పడి, చీమిడి రూపంలోనూ వస్తుంది. ఈ సమస్యకు కారణాలు ఏంటి? ఎలా బయటపడాలో తెలుసుకుందాం…
గళ్ళ (మ్యూకస్) అడ్డం పడటానికి కారణాలు
అప్పుడే పుట్టిన పిల్లలు మరియు స్కూల్ కు వెళ్తున్న పిల్లలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో తిరిగినప్పుడు, చల్లని నీరు తాగినప్పుడు, వైరస్ కారణంగా జలుబు, దగ్గు వచ్చి చీమిడి రావడం, చీమిడి బయటకు రానప్పుడు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు గళ్ళ వస్తుంది. అయితే కొన్నిసార్లు గొంతులోనే గళ్ళ ఆగిపోవడం వలన ఊపిరితిత్తులు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలకు జ్వరం, న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది.
గళ్ళ గొంతులో అడ్డు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేడి నీరు ఇవ్వడం
పిల్లలకు ఎప్పుడు చల్లగా ఉన్న నీరు ఇవ్వకూడదు. నీటిని వేడి చేసి గోరు వెచ్చగా లేదా చల్లార్చి ఇవ్వడం చేయాలి. ఇలా చేయడం వలన నీటిలో ఉన్న బాక్టీరియా చనిపోతుంది. అలాగే గోరువెచ్చగా ఉన్న నీరు ఇవ్వడం వలన గొంతులో అడ్డుగా ఉన్న గళ్ళ బయటకు వస్తుంది.
ఉప్పు నీటితో పొక్కిలించడం
చిన్న పిల్లలు నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీటిని వేడిచేసి అందులో కాస్త ఉప్పు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించేలా చేయడం వలన గొంతులో అడ్డు పడ్డ గళ్ళ బయటకు వస్తుంది. అలాగే గొంతు నొప్పి ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది.
ద్రవాలు ఎక్కువగా తాపించాలి
గొంతులో గళ్ళ పేరుకుపోయినట్లుగా మందంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. అది బయటకు రావాలంటే ఫ్రూట్ జ్యూస్ లను బాగా ఇస్తూ ఉండాలి. వీటిలో కాస్త నీరు కలిపి ఇవ్వడం గొంతునుండి గళ్ళ బయటకు వస్తుంది.
వేడి నీటితో స్నానం, ఆవిరి
పిల్లలకు గళ్ళ గొంతు దగ్గర ఉన్నప్పుడు ఎలా చెప్పాలో తెలీదు. అందుకని ఎక్కువగా దగ్గడం, గొంతు దగ్గర నొప్పి ఉందని చెప్పడం, ఛాతీని పట్టుకోవడం చేస్తుంటారు. అటువంటప్పుడు స్నానం గది వెచ్చగా ఉండేలా చేసి వేడి నీటితో స్నానం చేయించి ఆవిరి పట్టడం వలన పిల్లలకు రిలీఫ్ గా ఉంటుంది.
నిర్లక్ష్యం చేయకండి
పిల్లలలో దగ్గు, జలుబు సాధారణమే కదా అని నిర్లక్ష్యం చేయడం వలన వారికి చాలా ప్రమాదం. ఛాతీలో నొప్పి, ఊపిరి తిత్తుల సమస్య, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఆస్తమా, కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఏ తల్లితండ్రులైనా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని అందరికీ ఈ ముఖ్యమైన విషయాలను తెలియజేయండి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.
ఇవి కూడా చదవండి.