పిల్లలు పుట్టాక మీపై మీ భర్తకు ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన 5 విషయాలు

మీరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోతారు. మీకంటూ కాస్త సమయం కూడా దొరకదు. మీరు మీభర్తతో మునుపటిలా గడపటానికి సమయం అస్సలు సహకరించదు. దీంతో మీ మధ్య కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు కొన్ని పనుల ద్వారా మీభర్తతో సంతోషంగా గడపవచ్చు. అవేంటంటే,

కలిసి వండుకోవడం

మీరు అప్పుడప్పుడు కలిసి వండుకోవడం ద్వారా మీమధ్య బంధం బలపడుతుంది. మీభర్త అన్నం చేస్తే మీరు కూర చేస్తూ మునుపటిలా ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవాలి. మీరు ఒకరి మీద ఒకరు జోక్స్ వేస్తూ మాట్లాడుకోని ఆ తర్వాత కలిసి డిన్నర్ చేయండి.

చాటింగ్

మీరు  ఏదైనా విషయం చెప్పాలనుకుంటే, ఎక్కడ ఉన్నా కూడా మెసేజ్ పంపండి. మీరు పంపే ప్రతి అక్షరాన్ని, మాటను మీ భర్త ఎంజాయ్ చేస్తారు. దీని ద్వారా  మీమధ్య వచ్చిన ఫీలింగ్ ఉండదు.

కలిసి సినిమా చూడటం

ప్రసవానికి ముందు మీరు అప్పుడప్పుడూ సినిమాకు వెళ్ళి ఉంటారు. ఆ అలవాటును తిరిగి ప్రారంభించండి. బయటకు వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

డేట్‌కు వెళ్ళడం

మీరు మొదటిసారి మీభర్తను ఎక్కడ కలిశారో అక్కడికి వెళ్ళండి. మునుపటి జ్ఞాపకాలను కదిలించండి. అక్కడే మీ భర్తతో గడుపుతూ సమయాన్ని మర్చిపోండి. అలా ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపండి.

మసాజ్‌కు తీసుకెళ్ళండి

మీరు మాత్రమే మసాజ్‌కు వెళ్ళడం రొటీన్. మీ భర్తను కూడా మసాజ్‌కు తీసుకెల్తే అది త్రిల్‌గా ఉంటుంది. కపుల్ మసాజ్‌కు తీసుకెళ్ళడం ద్వారా మీ భర్తను ఆశ్చర్యానికి గురి చేసి అతని మన్ననలు పొందండి.

వాకింగ్

రాత్రిపూట మీకు నచ్చిన దారిలో ఇద్దరూ ఏకాంతంగా నడుస్తూ వెళ్ళండి. నడుస్తున్నంతసేపూ ఒకరితో ఒకరు మాట్లాడటం మర్చిపోకండి. ఇలా వెల్తూ మీకు చాలు అనుకున్నప్పుడు వెనక్కి వచ్చేయండి.

పిజ్జా

మీ ఇద్దరూ పిజ్జా ఇష్టంగా తినేవారైతే పిజ్జా ఆర్డర్ చేయండి. దాన్ని మీ ఇద్దరూ కలిసి తినండి. తింటూ తింటూ బాగా కబుర్లు చెప్పుకోండి. మీరు బేబీ పుట్టిన తర్వాత ఏం మిస్ అవుతున్నారో మీభర్తకు తెలియజేస్తూ అతని సహకారం కోరండి.

ఇద్దరూ కలిసి వ్యాయామం

మీరిద్దరూ కలిసి వ్యాయామం చేయండి. అది పార్క్‌కు వెళ్ళడం కావచ్చు లేదా జిమ్‌కు వెళ్ళడం కావచ్చు. ఇలా కలిసి వెళ్ళడం ద్వారా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది.

మీవారిని క్రికెట్ చూడనివ్వండి

సాధారణంగా మగవారికి గేమ్‌స్  అంటే చాలా ఇష్టం ఉంటుంది, కాబట్టి మీ వారు క్రికెట్ చూసేటప్పుడు చూడమని ప్రోత్సహించండి. దీని ద్వారా మీరు తనని అర్థం చేసుకున్నారని బావిస్తాడు.

వారాంతపు యాత్ర

మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినట్లు అనిపిస్తే వీకెండ్‌లో ఎక్కడికైనా యాత్రకు వెళ్ళండి. బైక్ రైడ్‌కు వెళ్ళడమో, దగ్గరలోని జలపాతాలను చూడటానికి వెళ్ళడమో చేయండి.

పైవన్నీ చేయడం ద్వారా మీరు మీభర్తతో మునుపటిలా గడపవచ్చు.

Leave a Reply

%d bloggers like this: