పిల్లలు భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులను అస్సలు చేయనీయకండి : చాలా ప్రమాదం

పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ఏ తల్లితండ్రులైనా సంతోషంగా ఉండగలరు. అందుకే పిల్లలకు ఏం చేయాలి అని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సరే పిల్లలు ఆహారం తీసుకున్న తర్వాత పిల్లలు ఈ పనులు చేయడం వలన వారికి చాలా ప్రమాదం. అందుకే ఈ పనులు ఇంకెప్పుడు  చేయకుండా చూసుకోండి.

తలక్రిందులుగా నిల్చోవడం

చాలావరకు పిల్లలు ఆహారం తీసుకున్న తర్వాత నిద్రకు సిద్ధమవుతుంటారు. కానీ కొందరు మాత్రం అస్సలు నిద్రపోకుండా అల్లరిచేస్తూ తలక్రిందులుగా నిల్చోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వలన పేగులలో సమస్య మొదలై కడుపునొప్పి రావడం, వాంతులు కావడం జరుగుతుంది.

వేళ్ళాడటం చేయకూడదు

భోజనం చేసిన తర్వాత పిల్లలు ఎత్తుగా రాడ్లు లేదా తన తండ్రిని పట్టుకుని వేళ్ళాడటం, కిటికీలు పట్టుకుని వేళ్ళాడటం వంటివి చేయడం వలన పేగులపై ప్రభావం చూపుతుంది. అప్పటివరకు బాగానే ఉన్నా రాత్రి నిద్రపట్టకుండా కడుపునొప్పి బాధిస్తుంది.

స్నానం చేయించకూడదు

పిల్లలైనా పెద్దలైనా సరే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. సాలిడ్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి అది అరుగుదలకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేస్తే విషంగా మారుతుందని అంటారు.

ఐస్ క్రీమ్స్, చాకోలెట్స్

ఆహారం తీసుకున్న తర్వాత లేదా నిద్రకు ముందు చాకోలెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం కూడా పిల్లలకు మంచిది కాదు. వీటిలో షుగర్ ఎక్కువగా ఉండటం వలన యూరిన్ ను ప్రోత్సహిస్తాయి కాబట్టి పిల్లలు నిద్రపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ధూమపానం వారి ముందు చేయకూడదు

భోజనం చేసిన తర్వాత పెద్దలైనా సరే  స్మోక్ చేయడం వారి ఆరోగ్యానికి మంచిది కాదు, అటువంటిది పిల్లల ముందు పొగత్రాగడం వలన వారి ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. పొగ వారికి దగ్గరగా వెళ్లడం వలన దగ్గు రావడం, ఊపిరి ఆడకుండా చేస్తుంది.

ఈ విషయాలు సాధారణమే కదా అని కొట్టిపారేయకుండా పిల్లలు పై విషయాలు చేయకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపెడుతుందా?

Leave a Reply

%d bloggers like this: