పుట్టిన నెల బిడ్డ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుందా? ఏ నెలలో పుట్టడం శ్రేష్టం!!

పిల్లలు పుట్టగానే ప్రతి తల్లితండ్రులు వెంటనే చేసే పని వారి జన్మ నక్షత్రం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందా? అని జాతకాలు చూపించడం. మనవాళ్ళు వీటిని ఎక్కువగా నమ్ముతారు మరియు ఫాలో అవుతున్నారు కూడా. అలాగే మీ పిల్లలు పుట్టిన నెలను బట్టి మీ పిల్లల భవిష్యత్,  వారి వ్యక్తిత్వం ముందే మీరు తెలుసుకోవచ్చు. చాలామంది పిల్లలపై చేసిన పరిశోధనల ద్వారా చెబుతున్న విషయాలు ఇవి. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే తెలుసుకోండి.

జనవరి

మీ పిల్లలు జనవరి నెలలో జన్మించినట్లయితే చిన్నతనంలో ఆనందంగా ఉండకపోయినా వారు పెరిగేకొద్దీ వారి చుట్టూ ఆనందం ఉంటుంది. అలాగే వీరు పెద్ద అయ్యే కొద్దీ చాలా అందంగా కనిపిస్తారు వయస్సు ప్రభావం కనిపించదు. ఏ విషయమైనా కరెక్ట్ టైం చేసే టైపు. ఐతే ఏ పని అయినా చేయాలంటే వీరికి తనవాళ్ల దగ్గరి నుండి ప్రోత్సాహం కోరుకుంటాడు. ఇతరుల పట్ల వినయ విధేయతలతో పాటు బాగా కృషి చేస్తారు. ఓటమి నుండి తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది.

ఫిబ్రవరి

ఈ నెలలో జన్మించిన వారు కొత్తగా ఆలోచిస్తారు వాళ్లకు నచ్చినట్లుగానే ఉంటారు. ఇతరులు ఆడించినట్లు ఆడించరు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఎవరైనా ఏదైనా చెబితే దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు. నాకు ఇది కావాలని ఆరాటం పడరు. నేను చేసే పని పదిమందికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వినోదాన్ని కోరుకుంటారు.

మార్చి

వీళ్ళకు చాలా సిగ్గు, కొంచెం పిరికితనం, సెంటిమెంట్ మరియు దయ కాస్త ఎక్కువ. అలాగే రహస్యపరులు. త్వరగా బయటకు ఏ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేరు. తమ జీవితాన్ని చక్కగా సేఫ్ గా ప్లాన్ చేసుకుంటారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే స్వభావం. కష్టాన్ని ఒకరే పడతారు, ఆనందాన్ని అందరితో పంచుకుంటారు. మంచి పనిచేస్తే ఇగో లేకుండా మెచ్చుకుంటారు.

ఏప్రిల్

ఈ నెలలో పుట్టినవారు చిన్నప్పటి నుండే చాలా ఆక్టివ్ గా ఉంటారు, రిస్క్ చేయడానికి ఇష్టపడుతుంటారు. వాళ్లకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మాట్లాడటం అంటే చాలా ఇష్టం వీరికి. తమ మాటలతోనే ఇతరులను ముందుకు నడిపించగలరు. వీళ్లపై వీరికి చాలా నమ్మకం ఎక్కువ. ఏదైనా సమస్య వచ్చినా ఇతరుల సహాయం లేకుండా వాళ్ళే సహాయం చేసుకోగలరు.

మే

మే లో పుట్టిన పిల్లలకు జాగ్రత్త ఎక్కువ. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ప్రాక్టికల్ ఆలోచిస్తారు. స్థిరంగా ఉండేలా చూసుకుంటారు. చిన్న వయస్సు నుండే ఆర్థికంగా బాగా సెటిల్ అవ్వాలి, మంచి జీవితం ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. వెంటనే కోపం వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది. నిజాయితీ పరులు. చేసే ప్రతి పనిలోనూ తమతో పాటు ఇతరులకు ఉపయోగపడేలా ఆలోచిస్తారు.

జూన్

ఈ నెలలో పుట్టిన బాగా చమత్కారులు మరియు హాస్యప్రియులు. ఏ విషయమైనా సరే టెన్షన్ పడకుండా నిదానంగా చేసుకోగలరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళను ఎప్పుడు నవ్విస్తుంటారు. తమ మాటలతో ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించమని అడుగుతారు. కొద్దిగా సరసం ఎక్కువ. ఎప్పుడు సినిమాల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. ఫ్రెండ్స్ తో ఉండటం, ఇతరులతో కలిసిపోవడం, కొత్తవాళ్లతో పరిచయం పెంచుకోవడం చాలా ఇష్టం.

జూలై

ఎవరైనా ఇబ్బందులలో ఉంటే అస్సలు తట్టుకోలేరు. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్ళను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా ఒకసారి అర్థం చేసుకున్నాక వీరి నుండి దూరం కాలేరు. తమ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది సాల్వ్ అయ్యేవరకు పోరాడతారు. వీళ్ళకు చిన్నపిల్లలు, జంతువులు అంటే చాలా ఇష్టం. కారణం లేకపోయినా ఉన్నట్లుండి డల్ అవుతుంటారు. అందరినీ నవ్వించగలరు.

ఆగస్టు

ఈ పిల్లలకు స్వతంత్రంగా బ్రతకడం అంటే ఇష్టం. ఎవరైనా వీరిని తక్కువగా చేసి చూసినా, తనపై దాడికి ప్రయత్నించినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఇతరులు చేసే ఏ మంచి పనైనా సరే గౌరవిస్తారు మరియు అభినందిస్తారు. ఎవ్వరిని ఎప్పుడు విమర్శించరు. అలాంటి వారంటే ఇష్టం ఉండదు. అలాగే ప్రతి ఒక్కటి చాలా శుభ్రంగా ఉండేలా శ్రద్ధగా చూసుకుంటారు. చదువులంటే అంత ఇష్టం చూపించరు కానీ జీవితం పట్ల క్లారిటీ ఉంటుంది.

సెప్టెంబర్

వీళ్లకు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. అలాగే ప్రతి పనినీ చాలా పర్ఫెక్ట్ గా నిర్వహించగలరు. జంతువుల పట్ల ప్రేమ ఎక్కువ. అనారోగ్యం బాలేనవారిని సొంత వాళ్ళలా చూసుకుంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుని, సహాయం చేసే స్వభావం. సమస్య వస్తే తప్పించుకోరు పోరాడతారు. వీళ్లకు ప్రయాణాలంటే ఇష్టం. అలాగే చాలా తెలివైనవారు, ఎవ్వరైనా సరే భయం అనేది ఉండదు.

అక్టోబర్

అక్టోబర్ లో పుట్టినవారికి భయం తక్కువ మరియు తెలివైన పిల్లలు. అందాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తారు . వీళ్ళను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలీదు కానీ తమ చుట్టూ ఉన్నవారు బాగా ఉండాలని కోరుకుంటారు. కొంచెం బద్దకస్తులే కానీ తమ ముందు అన్యాయం జరిగినా, తప్పు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతారు.

నవంబర్

ఈ నెలలో పుట్టినవారికి కొత్త విషయాలు తెలుసుకోవడం, రహస్యాలను ఛేదించడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఎవరితో ఉన్నా సరే సర్దుకుపోగలరు. ప్రేమైనా, కోపమైనా వెంటనే చూపించేస్తారు. బాధను తట్టుకోగలరు. అనారోగ్యం బారిన పడినా వెంటనే కోలుకుంటారు. అందరినీ నవ్వించగలరు. నా అనుకుంటే ప్రాణం ఇచ్చే రకం. అందంగా ఉంటారు తెలివిగా ఆలోచిస్తారు.

డిసెంబర్

చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. భోజన ప్రియులు. కొత్తవాళ్లతో స్నేహం చేయడం అంటే ఇష్టం. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్లకు బలం, బలహీనత. కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. దయ, జాలి, సహాయం చేసే గుణం ఎక్కువ. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తప్పు ఉన్నప్పుడు వాదిస్తారు. తమ జీవితంలో ప్రతిదీ బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి.

చేతి వేళ్ళ సైజును బట్టి మీ పిల్లల తెలివి తేటలు తెలుసుకోవచ్చు

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: