ప్రసవం తర్వాత జుట్టు రాలకుండా, చర్మం రంగులో మార్పులు రాకుండా తీసుకోవాల్సిన చిట్కాలు

ప్రసవం జరిగిన తర్వాత మీశరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీరు తిరిగి కోలుకోవడాన్ని చాలెంజ్ అని చెప్పవచ్చు. మీకు పాప బాధ్యతలు అదనంగా పెరుగుతాయి. వీటితో పాటూ మీ మీద మీరు కేర్ తీసుకోవాలి. ప్రసవం జరిగిన తర్వాత మీరు జుట్టు రాలడం, కళ్ళ కింద వలయాలు రావడం, చర్మం వదులు అవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే,

తగినంత నిద్ర

మీరు తల్లి అయిన తర్వాత నిద్రలేమితో చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఒక్కోసారి రాత్రి మొత్తం మీ బేబిని చూసుకుంటూ ఉండి పోయింటారు.  మీరు మీ కుటుంబ సభ్యుల సహకారంతో, ఫ్రెండ్స్ సహకారంతో రోజుకు కనీసం 6-7 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. దీని ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

వాటర్

మీరు రోజులో ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే అంత మేలు. శరీరంలో నీటి శాతం పెరిగే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల మీ చర్మంలో కాంతి పెరగడమే కాక మీలో ఒత్తిడి దూరం అవుతుంది.

మంచి ఆహారం

మీరు ప్రసవం జరిగిన తర్వాత చాలా బలహీనంగా తయారయి ఉంటారు. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి. మీరు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ వంటివి ఎక్కువ ఉండే ఆహార పధార్థాలు తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

శుభ్రత

మీరు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి, మీతో పాటూ మీ చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

చర్మ రక్షణ

ప్రసవం తర్వాత మీరు చర్మాన్ని అశ్రద్ధ చేయడం వల్ల అది కళావిహీనంగా తయారయి ఉంటుంది. కాబట్టి చర్మం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మేకప్ తీయకుండా నిద్రపోవద్దు. చర్మానికి సహజకాంతిని ఇచ్చే వాటినే వాడటం మంచిది.

జుట్టురాలడం

ప్రసవం జరిగిన తర్వాత కొన్ని వారాల వరకు జుట్టు రాలడాన్ని మీరు గమనించవచ్చు. మీరు జుట్టు రాలడాన్ని తగ్గించే షాంపూ వాడటం మంచిది. దీనితో పాటూ, కొబ్బరి-బాదాం నూనేలను కలిపి తలకు పట్టించి స్నానం చేయాలి.

జిడ్డు

మీ మొహం మీద జిడ్డు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కాంతిని కోల్పోయి ఉంటుంది. కాబట్టి మీరు రోజుకు 2 సార్లు మొహం కడుక్కోవడం వల్ల మొహాన్ని ఫ్రెష్‌గా చేయవచ్చు.

సూర్యరశ్మి

మీరు ఎప్పుడైనా బయటకు వెల్తుంటే సన్‌స్క్రీన్ లోషన్ చర్మానికి రాయడం మంచిది. దీని ద్వారా మీరు సూర్యుని కిరణాల బారిన పడకుండా మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. మీ చర్మానికి బొప్పాయి, హనీ, నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేయవచ్చు.

నడుం మీద ముడతలు

మీరు బేబీని మోయడం వల్ల మీకు నడుము భాగంలో ముడుతలు పడి ఉంటాయి. చర్మం మీద మంచి జాగ్రత్త చూపిస్తే అవి తోలగిపోతాయి. మీకు ముడుతలు తగ్గించే ఎన్నోరకాల క్రీంస్ బయట దొరుకుతాయి. వాటి ద్వారా ముడుతలు దూరం అవుతాయి. దీనికి తోడు చిన్నపాటి వ్యాయామం కూడా అవసరం.

కళ్ళ కింద నల్లటి వలయాలు

మీరు గత కొన్ని నెలలుగా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి ఉంటాయి. వీటిని తొలగించడానికి రోజూ పడుకొనే ముందు ఆల్‌మండ్ ఆయిల్‌తో కళ్ళకింద మర్ధనా చేయాలి. గ్రీన్ టీ సంచులను కళ్ళ కింద ఉంచడం ద్వారా కూడా నళ్ళటి వలయాలను పోగొట్టవచ్చు.

కెమికల్స్

మీరు తొందరగా అందంగా కనిపించడానికి ఏవంటే అవి కెమికల్స్ వాడకండి. అలా వాడటం వల్ల చర్మం మీద ర్యాషెస్ రావచ్చు.

వైద్యున్ని కలవండి

పైవన్ని చెసినా మీ చర్మంలో మార్పు  రాకపోతే, దానికి కారణం మీ శరీరంలో తగినన్ని హార్మోన్స్, మినరల్స్ లేవని అర్థం.  కాబట్టి మీరు మరో ప్రయత్నంగా వైద్యున్ని సంప్రదించాలి. వారి సలహాల వల్ల కూడా మీరు మునుపటిలా మారవచ్చు.

Leave a Reply

%d bloggers like this: