ప్రసవం తర్వాత హార్మోన్ మార్పులు- మీ జీవితాన్ని ఎలా మారుస్తాయంటే..!

ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరం మామూలు కన్నా 100 రెట్లు అధికంగా హార్మోన్స్ విడుదల చేస్తుంది. ఆ హార్మోన్స్ బిడ్డ యొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. ప్రసవం జరిగిన తర్వాత మీ శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. అవన్నీ నార్మల్ అవడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. మీకు హార్మోన్ అసమతుల్యం వల్ల ఈ క్రింది మార్పులు లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వక్షోజాలలో నొప్పి

మీరు బిడ్డకు ఎక్కువగా పాలు ఇవ్వడం వల్ల మీ వక్షోజాలలో నొప్పి రావచ్చు లేదా హార్మోన్ అసమతుల్యం వల్ల కూడా మీకు బ్రెస్ట్ దగ్గర నొప్పి రావచ్చు. మొదటి సంవత్సరం వరకు మీ బ్రెస్ట్ సైజ్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

వెజినా దగ్గర నొప్పి, స్రావం

మీకు గత 9 నెలలుగా స్రావం కాకపోవడం వల్ల ప్రసవం జరిగిన తర్వాత కొన్ని వారాల వరకు రక్తస్రావం జరుగుతుంది. మీది నార్మల్ డెలివరీ అయితే మీకు వెజినా దగ్గర నొప్పి కొన్ని వారాల పాటు ఉంటుంది. ఈ సమయంలో మీరు వెజినాకు సంబంధించి చాలా కేర్ తీసుకోవాలి.

బరువు

ప్రసవం అయిన తర్వాత మిమ్మల్ని బాగా బాధపెట్టే విషయం బరువు. ప్రసవం తర్వాత మీలో చాలా కొవ్వు పేరుకుపోతుంది కానీ హార్మోన్ల వల్ల ఆ ఫ్యాట్ కరగదు. ఒక్కోసారి మీరు బరువు గురించి అప్‌సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే, మీ బరువు కొన్ని నెలల్లో సాధారణం అయ్యే అవకాశం ఉంది.

జుట్టు రాలడం

ప్రసవం జరిగిన తర్వాత మీకు జుట్టు రాలే సమస్య ఎక్కువ అవ్వవచ్చు. దీనికి కూడా హార్మోన్ అసమతుల్యతే కారణం. ప్రెగ్నెన్సీ సమయంలో మీ జుట్టూ కొంచెం మందంగా అవుతుంది ప్రసవం జరిగిన తర్వాత నార్మల్ అయ్యే క్రమంలో మీరు జుట్టు కోల్పోవచ్చు, ఈ సమస్య కొన్ని రోజుల్లో మామూలు అయిపోతుంది.

నిద్రలేమి

ప్రెగ్నెన్సీ సమయంలో మీకు కడుపులో బిడ్డ కదలికల వల్ల నిద్ర వచ్చిఉండదు. అయితే ప్రసవం జరిగిన తర్వాత కూడా మీరు అలాగే ఫీల్ అవడం వల్ల నిద్రలో మెలుకువ వస్తూ ఉంటుంది. ఈ సమస్య కూడా కొన్ని రోజులలోనే మాయం అవుతుంది.

మీరు తీసుకోవల్సిన ఆహార పధార్థాలు

లివర్ మరియు  గ్రుడ్లు

గ్రుడ్లు మరియూ లివర్ తీసుకోవడం వల్ల మీ డైట్ సమతుల్యం చెంది మీకు కావల్సిన పోషకాలు అందుతాయి దీంతో మీలో హార్మోన్స్ సమస్తుల్యం చెంది మీరు నార్మల్ అవుతారు.

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీలో ఎక్కువగా ఉండే హార్మోన్స్ ఈస్ట్రోజన్‌తో కలిసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొస్తాయి.

విటమిన్ డి

విటమిన్ డి సమృద్ధిగా అందాలంటే ఉదయం సూర్యుని ఎండలో కొంతసేపు గడపాలి. దాని వల్ల మీ శరీరం హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కోసారి వైద్యులు విటమిన్ డి కోసం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు.

మెగ్నీసియం

మెగ్నీసియాన్ని శరీరానికి అందివ్వడం వల్ల మీరు మళ్ళీ నార్మల్ అవుతారు. మెగ్నీసియం ఆయిల్, పౌడర్‌లతో పాటూ ట్యాబ్లెట్‌లలో కూడా లభ్యం అవుతాయి.

నో కాఫీ

కాఫీ ఎక్కువ్గా తీసుకోవడం వల్ల మీ పరిస్థితి మరీ దారుణం అవుతుంది.  కాబట్టి మీరు వీలైనంత తక్కువగా కాఫీ తీసుకోవడం మంచిది. 

Leave a Reply

%d bloggers like this: