మహిళ సంతోషంతో కన్నీరు పెట్టుకునే క్షణాలు ఒక బిడ్డకు తల్లి అయ్యినప్పుడే. అందుకే మాతృత్వంతోనే మహిళ జీవితం సంపూర్ణమవుతుందని మన పెద్దలు అంటారు. మరి ఒక బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ చెప్పుకునే పండ్లను అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకుని ప్రతి మహిళకు తెలుపండి.
పైనాపిల్
గర్భంతో ఉన్న మహిళలు ప్రసవించేవరకు తినకూడని ఫ్రూట్ పైనాపిల్. ఇందులో ఉండే బ్రొమలైన్ అనే పదార్థం గర్భాన్ని కొంచెం కొంచెంగా దూరం చేస్తుంది. ఈ పండు గర్భంతో ఉన్నపుడు తినడం వలన గర్భం పోవడం లేదా పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా పుట్టడం జరుగుతుంది. అందుకే ఈ పండును అస్సలు తినకూడదు.
లోంగన్ ఫ్రూట్
ఈ ఫ్రూట్ గురించి చాలా తక్కువగా విని ఉంటారు. కానీ గర్భంతో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ తినడం వలన ప్రెగ్నన్సీతో ఉన్న మహిళకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఇది తినడం వలన శరీరంలో వేడిని కలిగిస్తుంది. దీని కారణంగా గర్భంలో బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది మరియు గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
బొప్పాయి
ఇది తినకూడదని ప్రెగ్నన్సీతో ఉన్న వారికి అందరు చెబుతుంటారు. ఐతే బొప్పాయి తినడం వలన ఏమీ కాదని, ఆరోగ్యానికి మంచిదేనని మరికొందరు అంటుంటారు. కానీ, ఇందులో ఉండే లేటెక్స్ అనే పదార్థం గర్భంలో సంకోచాలు కలిగించి గర్భవిచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది.
నల్ల ద్రాక్ష
నల్ల ద్రాక్షను గర్భం సమయంలో తినడం మంచిదా?కాదా? అని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి నల్లద్రాక్ష తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో శరీరానికి వేడి కలిగించే గుణం ఎక్కువ. రక్తాన్ని కలిగిస్తుంది అనేది నిజమే కానీ శరీర వేడి కారణంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే వద్దని చెబుతారు.
లిచీ ఫ్రూట్
మాములుగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ తినడం ఆరోగ్యకరమే. కానీ గర్భంతో ఉన్నప్పుడు తినడం వలన మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి డయాబెటిస్ కు కారణమవుతుంది. అలాగే లోంగన్ ఫ్రూట్ లాగే శరీరంలో వేడిని పుట్టించి బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఇంకా గర్భంతో ఉన్నప్పుడు తీసుకునే పండ్లను శుభ్రంగా కడిగి తినడం చేయాలి. చాలావరకు ప్రస్తుతం కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు కాబట్టి తల్లికి బిడ్డకు మంచిది కాదు. అలాగే ఏం తినాలి, ఏం తినకూడదో డాక్టర్ ను ఖచ్చితంగా అడగండి.
దయచేసి ఈ విలువైన సమాచారం ప్రతి తల్లికీ చేరేలా SHARE చేయండి. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు.
ఇవి కూడా చదవండి.