ప్రెగ్నన్సీ సమయంలో కడుపులో బిడ్డకు ప్రమాదం కలగకుండా ఎలా పడుకోవాలి..!

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు బట్టల నుండి తీసుకునే ఆహరం వరకు, బాత్రూమ్ కి వెళ్ళే సమయం నుండి నిద్రపోయే సమయం వరకు అన్ని మారిపోతాయి. నిద్రపోయే సమయం మాత్రమే కాదు, నిద్రపోయే సమయంలో ఎలా పడుకోవాలి అనే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రెగ్నన్సీ తో ఉన్న సమయంలో ఎలా పడుకోవాలి? ఎలా పడుకోకూడదు? ఇక్కడ తెలుసుకుందాం!!

ఎలా పడుకోవాలి!!

1. పక్కకు పడుకోవడం

ప్రెగ్నన్సీ సమయంలో పక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం. కుడి వైపు తిరిగి పడుకోవడం కన్నా, ఎడమ వైపు పడుకోవడం ఇంకా మంచిది. కుడి వైపుకు తిరిగి పడుకోవడం వలన, కడుపులో పెరిగే పిండం మీ కాలేయం మీద వత్తిడి కలిగిస్తుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వలన, కాలేయం మీద వత్తిడి ఏమి ఉండదు. అంతేకాకుండా కడుపులో బిడ్డకు కావాల్సిన పోషకాలు, రాకత ప్రసరణ సక్రమంగా జరుగుతాయి.

2. వీపుతో పడుకోవడం

మీకు మొదటి నుండి వెల్లకిలా వీపుతో పడుకోవడం అలవాటు ఉంటే, ప్రెగ్నన్సీ సమయంలో అలా పడుకోవచ్చు. కానీ కడుపుతో ఉన్న మొదటి మూడు నెలలు అలా వెల్లకిలా పడుకోవడం వలన ఏ సమస్య ఉండదు. కానీ మూడవ నెల తరువాత వెల్లకిలా పడుకోవడం మంచిది కాదు. మీ వెన్ను మీద ఎక్కువ వత్తిడి పడుతుంది, మీ రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది మీకు, కడుపులో బిడ్డకు ఇద్దరికి ప్రమాదమే.

ఎలా పడుకోకూడదు!!

పొట్ట మీద పడుకోవడం

గర్భం తో ఉన్న సమయంలో పొట్ట మీద బోల్డ పడుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం మీ రక్త ప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. ఏది మీ కడుపులో బిడ్డకు చాలా ప్రమాదం. అంతే కాకుండా కడుపులో బిడ్డ మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. అది బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. 

Leave a Reply

%d bloggers like this: