ప్రెగ్నెన్సీ సమయంలో ఏమి తినాలి? ఏమి తినకూడదు? మీ బిడ్డ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది

మహిళలు గర్భాన్ని దాల్చినప్పుడు తమకు, తమ బిడ్డకు సరిపడా అహారం తీసుకోవాలి. అయితే ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకోకుడదో సరిగ్గా తెలిసిఉండకపోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో, ఎలాంటిది తీసుకోకుడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తినవలసినవి

కార్బోహైడ్రేట్లు

మీరు సరైన మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మీకు, మీ కడుపులోని బిడ్డకు సరైన శక్తి లభిస్తుంది. మనకు బంగాళాదుంపలు, అన్నం, బ్రెడ్ వంటి వాటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్ళు లభ్యమౌతాయి.

అన్‌స్యాచురేటెడ్ ఫుడ్స్

ఉన్స్యాచురేటేడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటీ కొవ్వులు చేరవు. కాబట్టి సాధారణ ఆయిల్ వాడటం కన్నా ఆలివ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి వాడుకోవాలి. వీటితో పాటూ అవకాడో కాయలు, డ్రై ఫ్రూట్స్, బాదం వంటి ఆహార పధార్థాలు తీసుకోవాలి.

ప్రొటీన్స్

మీరు తగినంత ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ బిడ్డ యొక్క ఖండరాలు బలం అవుతాయి. మాంసం, చేప, బీన్స్, గ్రుడ్డు, పప్పుధాన్యాలు వంటి పధార్థాలలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

విటమిన్స్ అండ్ మినరల్స్

ప్రెగ్నెన్సీ సమయంలో మీకు తగినన్ని విటమిన్స్ మరియూ మినరల్స్ కావాలి. వీటి వల్ల మీకు హార్మోన్ సమతుల్యత ఏర్పడుతుంది లేకపోతే మీ శరీరం బాగా ఇబ్బంది పడుతుంది. పాల ఉత్పత్తులలో, సోయా బీన్స్, మాంసం, అల్లం, ఉల్లిపాయలు వంటి వాటిలో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. జింక్, కాల్సియంలు ఎక్కువగా ఉండే అహారాన్ని కూడా తీసుకోవాలి.

ఫైబర్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణం అయ్యి ప్రేగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

తినకూడని పధార్థాలు

– ప్రెగ్నెన్సీ సమయంలో సరిగ్గా ఉడికించని ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే అందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది.

– మెర్క్యూరీ ఎక్కువగా ఉండే ఫిష్ ఆహారాన్ని తీసుకోకూడదు. టూనా, గోల్డ్ ఫిష్, షార్క్‌లలో ఎక్కువ శాతం మెర్క్యూరీ ఉంటుంది.

– వేరే పధార్థాలతో కలిసిన గుడ్లను తీసుకోకూడదు  ఎందుకంటే బ్యాక్టీరియా ఇంఫెక్షన్ సోకవచ్చు.

– మీరు కాఫీని పూర్తిగా అవాయిడ్ చేయాలి, ఒకవేల తాగాలనిపిస్తే రోజుకు 200 మిల్లిగ్రాములను  మించకుండా చూసుకోవాలి.

– మీకు ఊల్కాహాల్ తీసుకొనే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయండి. లేకపోతే గర్భం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

సాధారణ సూచనలు

– మీరు ఎప్పుడు కూడా తాజా ఆహార పధార్థాలనే తీసుకోండి.

– మీ ఆహారంలో అన్ని విటమిన్లు, హార్మోన్లు కవర్ అయ్యేలా చూసుకోండి.

– టైమ్ పాస్ కోసం ఏవంటే అవి తినకండి. స్నాక్స్ తీసుకొనే  విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

– నీరు సమృద్ధిగా తాగండి.

Leave a Reply

%d bloggers like this: