బ్రా టైట్ గా వేసుకుంటే వక్షోజాలకు ఏమవుతుంది..! అసలు నిజం తెలుసుకోండి

చాలా మంది మహిళలు అందంగా, ఫాన్సీగా ఉండే బ్రా లను ఎంచుకుంటారు. లేస్, నెట్, అండర్ వైర్ బ్రా, ఇలా కంటికి అందంగా కనిపించే అనేక రకాల  బ్రాలను వాడుతుంటారు. కానీ బ్రా ఎంచుకునే ప్రక్రియలో, ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయాన్నీ మర్చిపోతుంటారు. అదే సైజ్, బ్రా తీసుకునేటప్పుడు అది మీ సైజు కు తగట్టు ఉండేలా చూసుకోవాలి. మీరు సరిపోని బ్రాలను బిగుతుగా వేసుకోవడం అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకోండి…

1. వక్షోజాల నొప్పి

సరైన సైజు బ్రా ధరించకపోవడం వలన వచ్చే సమస్యలలో ప్రధానమైనది, వక్షోజాల నొప్పి. టైట్ ఫిట్టింగ్ బ్రాస్ ధరించడం వలన, వక్షోజాల కండరాల మీద, కణజాలం మీద వత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా మీకు వక్షోజాలకు నొప్పి కలగవచ్చు.

2. వెన్ను నొప్పి

టైట్ బ్రా వేసుకోవడం వలన మీరు ఎదురుకోవాల్సిన ఇంకో సమస్య వెన్ను నొప్పి. ముఖ్యంగా పెద్ద సైజు వక్షోజాల కలవారు, చిన్న సైజు బ్రా ధరించడం వలన వెన్ను నొప్పికి గురవుతారు. బిగుతుగా ఉండే బ్రా, వెన్ను మీద తీవ్రమైన వత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా తీవ్రమైన వెన్ను నొప్పికి గురవుతారు.

3. భుజాలు, మెడ నొప్పి

టైట్ బ్రాస్ వేసుకున్నప్పుడు, ఆ స్ట్రాప్స్ బుజాల మీద, మెడ మీద వత్తిడిని కలిగిస్తాయి. అంతేకాకుండా స్ట్రాప్స్ గట్టిగ వత్తుకుపోవడం వలన, భుజాలు మీద గుర్తులు ఏర్పడుతాయి. మెడ, భుజాలు నొప్పికి గురవుతాయి.

4. నాడులు మూసుకుపోతాయి

లింఫ్ నదులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎక్కువ వత్తిడిని తట్టుకోలేవు. టైట్ బ్రాలు వేసుకోవడం వలన ఆ వత్తిడికి నాడులు మూసుకుపోతాయి. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే అనేక సమస్యలు వస్తాయి.

5. శరీరాకృతి

టైట్ ఫిట్ బ్రాలు ధరించడం వలన కలిగే, వెన్ను నొప్పి, మెడ, భుజాల నొప్పులు, మీ శరీరకృతి మీద ప్రభావం చూపిస్తాయి. వెన్ను నొప్పి కారణంగా మీ వంగిపోతారు. నడిచేటప్పుడు భుజాలు వంగిపోతాయి.

6. బ్రెస్ట్ కాన్సర్ రావచ్చు

టైట్ బ్రా లు వేసుకోవడం వలన మీకు బ్రెస్ట్ కాన్సర్ కూడా రావచ్చు. వక్షోజాల కండరాల మీద పడే అధిక వత్తిడి,కణజాలాన్ని దెబ్బ తీస్తుంది. దీని మూలంగా మీకు బ్రెస్ట్ కాన్సర్ రావచ్చు.

7. చర్మ సమస్యలు

బిగుతుగా ఉండే బ్రాలను ధరించడం వలన చమట ఎక్కువగా పోస్తుంది. రోజంతా చమట అలానే ఉండిపోవడం వలన బాక్టీరియా పెరిగిపోతుంది. దీని అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి.

అందుకే, ఈ సమస్యలన్నీ దూరంగా ఉంచడానికి, మీరు బ్రా ను ఎంచుకునేటప్పుడు చూడడానికి బాగుండడం కాకుండా, మీకు సరిగ్గా సరిపోయే  సైజు బ్రాను ఎంచుకోండి. 

Leave a Reply

%d bloggers like this: