తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారం పాలు తాగే పిల్లలపైనా ప్రభావం చూపెడుతుంది. మీరు బాగా గమనించినట్లయితే పసిపిల్లలలో దగ్గు, జలుబు తరచూ వస్తుండటం, వారి చర్మంపై దద్దుర్లు, మంట కలుగుతూ ఉంటాయి. తల్లి తీసుకునే ఆహారమే ఇందుకు కారణం. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో ఈ ఆహారాలను అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకోండి.
గొడ్డు మాంసం
తల్లి పాలు బిడ్డకు 6 నెలల వరకు తప్పనిసరి కాబట్టి ఈ సమయంలో గొడ్డు మాంసం తినడం వలన అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొందరికి ఈ ఆహారం పడకపోవడం వలన చర్మంపై దద్దుర్లు, మంట కలిగి ఇబ్బంది కలుగజేస్తాయి.
కెఫీన్
కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే కాఫీ, టీ, సోడా ఎక్కువగా తీసుకోవడం వలన బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో గ్యాస్ సమస్యలు మీ పిల్లలకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే పిల్లలలో కొన్ని నొప్పులు ఎందుకు వస్తాయో తెలీదు. దానికి కారణం ఇదే. పాలు ఇవ్వడం మానేసిన తర్వాత హ్యాపీగా కాఫీ, టీ తాగవచ్చు.
ఉల్లిపాయ వద్దు, వెల్లుల్లి మంచిదే
పాలిచ్చే తల్లులు వీలైనంత వరకు ఉల్లిపాయకు దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో అరుగుదలపై ప్రభావం చూపుతుంది. అలాగే వాసన ఎక్కువగా వస్తుంది. ఐతే వెల్లుల్లి మీ డైట్ లో చేర్చుకోవడం వలన పాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
గ్యాస్ ను కలుగజేసే ఆహారాలు
పిల్లలకు మీకు పాలిచ్చే సమయంలో ఈ ఆహారాలు అంత మంచివి కావు. అవేంటంటే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆనియన్స్ మరియు పెప్పర్. అలాగే మితిమీరి సోయా బీన్స్ తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు కలుగుతాయి.
స్మోకింగ్ అండ్ డ్రింకింగ్
నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయితే మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తుచేయాలని చెప్పడానికే. పాలిచ్చే తల్లులు స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వలన తల్లిపాలలోకి చేరి పిల్లలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. పిల్లలలో ఉన్నట్లుండి దగ్గు, లంగ్స్ లలో నొప్పికి కారణమవుతాయి.
సాఫ్ట్ డ్రింక్స్ మరియు మసాలా పదార్థాలు
కెమికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన తల్లి పాలతో కలిసి బిడ్డకు చేరినప్పుడు పిల్లల పళ్ళపై, వారి పేగులకు ఇబ్బందిని కలుగజేస్తాయి. అలాగే మసాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మీతో పాటు మీ బిడ్డకు వీటిని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ సమయం మరియు ఇబ్బందిని కలిగిస్తాయి.
అలాగే ఎక్కువగా పాలు, మైదా ఆహారం, టమోటా, షెల్ ఫిష్, ఎగ్ వైట్ లను పాలిచ్చే తల్లులు తీసుకోవడం తగ్గించడం మంచిది. దయచేసి ఇది ప్రతి తల్లికీ తెలిసేలా SHARE చేయండి. పిల్లల ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లితండ్రులు సంతోషంగా ఉండగలరు.
ఇవి కూడా చదవండి.