భార్య భర్త నుండి తప్పక కోరుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

అలవాటైన ప్రపంచం నుండి తెలియని కొత్త ప్రపంచంలోకి వివాహబంధం ద్వారా మగ,ఆడ ఒక్కటై దంపతులుగా పిలవబడతారు.  అయితే పెళ్లి తర్వాత నీ భర్తతో ఈ విధంగా నడుచుకోవాలి అని ప్రతి తల్లీ తన కూతురికి చెబుతుంది. కానీ ప్రతి భార్య తన భర్త నుండి ఏం కోరుకోవాలి? అనే విషయాలు మాత్రం చెప్పరు. ఆ విషయాలు ఈ రోజు మీరే తెలుసుకోండి..

అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పాలి

ఇద్దరు కలిస్తేనే దంపతులు. అంటే మీ ఇద్దరు కలిస్తేనే అందమైన జీవితం. అటువంటప్పుడు మీ భర్త నుండి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య  ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఏ సమస్య వచ్చినా ఓపెన్ గా చెప్పమనాలి. నిజాయితీగా ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకోవడం వలన ఇద్దరి మధ్యా ఎటువంటి దాపరికాలు ఉండవు. ఇలా ఉంటే మీ దాంపత్యం రంగుల హరివిల్లులా ఉంటుంది.

రక్షణ.. భౌతిక, భావోద్వేగ, ఆర్ధిక పరంగా

పెళ్లి తర్వాత మీ భర్తే మీకు తల్లి, తండ్రి. ఏ పని చేసినా మా ఆయన తోడుంటాడు, ఏ నిర్ణయం తీసుకున్నా మా ఆయన అండగా నిలబడతాడు అనే రక్షణ భార్య కోరుకుంటుంది. కేవలం భౌతికంగానే కాదు, బాధలో ఉన్నప్పుడు భావోద్వేగాలు పంచుకోవడానికి, తనకు ఏదైనా అవసరం  ఉంటే ఆర్థికంగా రక్షణ కల్పించాలి.

టైం

ప్రస్తుత బిజీ లైఫ్ లో బంధాలు అనుబంధాలను దూరం చేస్తున్నది టైం. మీ ఆయన ఆఫీస్ లో, ఆయన బిజినెస్ తో ఎంత బిజీ అయినా అయ్యుండవచ్చు కానీ మీతో, మీ పిల్లలతో సరైన సమయం గడపకపోతే అందరి మధ్య దూరం పెంచుతుంది. ప్రతి భార్య తన భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది కాబట్టి ఆ విధంగా భర్తలు ప్లాన్ చేసుకోవాలి. అలాగే పిల్లలు తండ్రిని చాలా మిస్ అవుతున్నాం అని భావిస్తుంటారు. మీ ఆయనకు ఈ విషయం అర్థమయ్యేలా తెలుపవలసిన బాధ్యత మీ పైనే ఉంది.

ఎప్పుడు ఇదే కోరుకుంటారు

ఇది చదివే ముందు మీరు పెళ్లి చేసుకున్న కొత్తలో మీ భార్యతో ఎలా ఉన్నారో గుర్తుతెచ్చుకోండి. ఒకటి, రెండేళ్ల వరకు అదే ప్రేమ,  అదే ఆప్యాయత, రొమాన్స్ అంతా బాగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత భార్యపై ప్రేమను తగ్గిస్తూ ఉంటారు. పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనే బాధ్యతలపై ఎక్కువ సమయం గడుపుతూ భార్యను పక్కన పెడుతుంటారు. కానీ ప్రతి భార్య తన భర్త నుండి ప్రతి రోజూ అదే ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కోరుకుంటుంది. ఇంతకుమించిన ఆనందం ఆమెకు మరేదీ ఉండదు.

అందరు గర్వపడేలా

తన భర్తను తన ముందే ఎవరైనా (ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు) తక్కువ చేసి మాట్లాడితే అస్సలు తట్టుకోలేదు భార్య. తన భర్తను అందరూ గౌరవించాలి, నా పిల్లలు తన తండ్రి గర్వంగా, గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీరే మీ ఆవిడ ప్రపంచం అయినప్పుడు ఆమెకు మరేదీ గొప్ప కాదు కదా..

భార్యలకు భర్తలు ఎన్ని బహుమతులు అయినా ఇస్తుండవచ్చు కానీ పంచాల్సిన టైంలో ప్రేమ, ఆప్యాయత, దారిలో పెట్టాల్సిన సమయంలో  పిల్లలను సరిగ్గా చూసుకోకపోతే భర్తగా మీరు ఎంత చేసినా వృధానే అవుతుంది.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి.  అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి. 

అమ్మగా మీ జీవితం సంతోషంగా ఉండడానికి 4 మార్గాలు : ఇవి పాటిస్తే ఎల్లప్పుడూ సంతోషమే

image source: india.com

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: