మహిళలలో నెలసరి రాకపోతే చాలా ప్రమాదం : ఇలా జరగడానికి 5 కారణాలు

ప్రతి నెల  నెలసరి జరగడం, మీ ఆరోగ్యం సరిగా ఉంది అని చెప్పడానికి ఒక గుర్తు. ఒక వేళ మీరు ఋతుచక్రం మిస్ అయితే,  దానికి కారణం మీరు ప్రేగ్నన్ట్ అవ్వడం ఒక కారణం కావచ్చు. కానీ ప్రతి సారి అదే కారణం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కారణాల వలన కూడా మీకు నెలసరి రాకపోవచ్చు.

1. వత్తిడి

వత్తిడి వలన తల నొప్పి, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయని తెలిసిందే. కానీ అధిక వత్తిడి వలన నెలసరి కూడా ఆగిపోవడం జరుగుతుంది. అధిక వత్తిడి వలన శరీరంలో వత్తిడి హార్మోన్స్ విడిదలవుతాయి. దీనిని ఎదురుకోవడానికి మెదడు రక్త ప్రసరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పునరుత్పత్తి ప్రక్రియలను నిర్లక్ష్యం చేస్తుంది. అందువలన మీ ఋతుచక్రం జరగకపోవచ్చు.

2. బరువు

మీ శరీర బరువు, మెదడులోని హైపోథలామస్ అనే గ్రంధి మీద ఆప్రభావం చూపిస్తుంది. ఈ గ్రంధి పీరియడ్స్ ను నియంత్రిస్తుంది. మీరు వండాల్సిన దానికంటే, ఎక్కువ లేదా తక్కువ బరువు ఉంటే, ఈ గ్రంధి నెలసరి రాకుండా చేస్తుంది.

3. వ్యాయామం

వ్యాయామం శరీరానికి అవసరమే. కానీ అధికంగా చేసే వ్యాయామం, మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఋతుచక్రం జరగడానికి ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం వలన నెలసరి రాకపోవచ్చు.

4. జీవన శైలిలో మార్పు

మీ రోజు వారి దిన చర్యలో జరిగే మార్పులు మీ నెలసరి మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట పని చేసే మహిళలలో ఈ సమస్య ఉంటుంది. రాత్రి పూట పని చేయడం వలన, నిద్రపోయే వేళలు, తినే వేళలు పూర్తిగా మారిపోతాయి. దీని వలన జరిగే హార్మోన్ల అసమతుల్యత ఋతుచక్రం రాకపోవడానికి కారణం కావచ్చు.

5. బ్రెస్ట్ ఫీడింగ్

మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టయితే, మీకు నెలసరి రాకపోవడానికి అవకాశం ఉంటుంది. రొమ్ములు పాలను ఉత్పత్తి చేసే ప్రోలక్టీన్ అనే హార్మోన్, మీ శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదలను తగ్గిస్తుంది. ఫలితంగా మీకు ఋతుచక్రం రాకపోవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: