మిమ్మల్ని బాధపెట్టే మీ భర్త నుండి వచ్చే 6 మాటలు

ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆడ-మగా అనే తేడా లేకుండా ఉద్యోగం చేస్తున్నారు.  అలా మన జీవనశైలి మారడానికి మనం కూడా ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నాము. అయితే, మనం ఎంత నాగరికంగా మారుతున్నా లింగ వివక్ష అలాగే ఉంది. ఎక్కడో ఒకచోట అది కనబడుతూనే ఉంటుంది. మగవారు తమ ఆధిక్యతను చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం వారితో పాటూ సమానంగా పని చేస్తున్నా కూడా గుర్తించరు. ఈ క్రమంలో వారు కొన్ని మాటలు అంటారు. ఆ మాటల  వల్ల మనం చాలా బాధపడతాము. అవేంటంటే,

వంట చేయమనడం

రోజులో వారెంత కష్టపడతారో మనం కూడా అంతే కష్టపడతాం. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత చాలా మంది భర్తలు అనే మాట ఏంటంటే, వంట చెయవా? నేను చాలా అలసిపోయాను అని. అయితే మనం కూడా రోజూ ఆఫీస్‌కు వెల్తున్నామని వారు గుర్తించరు.

మనల్ని వదిలివెళ్ళడం

చాలా మంది మగవారికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా మ్యాచ్ ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి చూడాలని నైట్ మనల్ని ఒక్కరినే వదిలి వెల్తారు. మీరేమొ మీభర్తతో గడపాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ మీవారు మీతో స్పెండ్ చేయరు.

 అది చేయకు, ఇది చేయకు 

చాలా మంది భర్తలు ఏదైనా సమస్య వస్తే జాబ్ మానేయమని చెప్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది మరీ ఎక్కువ అవుతుంది. నిజంగా జాబ్ మానేయడానికి చదవడం దేనికి అన్న ఆలోచనలు వస్తాయి. మనల్ని కేవలం ఇంటి దగ్గరే ఉంచాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాక, జాబ్ కోసం ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తే కూడా భర్తలు అనే మాట జాబ్ మానేయండి అని. వారికి వారి జాబ్ ఎంత ముఖ్యమో, మనకు మన జాబ్ కూడా అంతే ముఖ్యమని వారి అర్థం కాదు.

బరువు

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి మహిళ కూడా బరువు పెరుగుతుంది. ఇది అందరికీ ఎదురయ్యే అంశమే. కానీ, మీ భర్త అప్పుడప్పుడు మీ బరువును గుర్తు చేస్తూ మీమీద జోక్స్ వేస్తుంటాడు. మీరు చిరాకు తెచ్చుకున్నా ఒక్కోసారి అలాగే తీజ్ చేస్తుంటారు.

తక్కువ చేయడం

చాలా మంది అబ్బాయి తల్లి చాటు పిల్లలే. వారు మీమీద ఎంత ప్రేమ చూపిస్తున్నా  తల్లి విషయానికి వచ్చేసరికి ఆమెకే మద్ధతు ఇస్తాడు.  ఒకవేల మనం కరెక్ట్‌గానే ఉన్నా కూడా మీభర్త మీఅత్తగారిని సమర్థిస్తాడు.

పై అన్ని సంధర్భాలలో మీభర్త మీద మీకు కోపం వస్తుంది ఎందుకంటే, తన మాటలతో మిమ్మల్ని బాధపెడతాడు కాబట్టి. 

Leave a Reply

%d bloggers like this: