భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా, మీ దాంపత్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఏం చేయాలో బహుశా మీకు ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ 4 అలవాట్లు మీకు ఉంటే ఇక మీమధ్య ఎటువంటి అపార్థాలు, అపోహలు ఉండవు. అవేంటో మీరే తెలుసుకోండి.
కలిసి భోజనం చేయడం
మీకు పిల్లలు ఉంటే వారికి ముందే భోజనం చేయించి ఆ తర్వాత మీరు మీ భర్త కలిసి భోజనం చేయండి. ఎవరో ముక్కు మొహం తెలియని వారిలా కాకుండా ఇద్దరికీ ఒకరికొకరు తినిపించుకోవడం వలన మీ మధ్య ప్రేమ, ఆప్యాయత మరింత పెరుగుతుంది. కొన్నికొన్ని సార్లు మీ ఆయనకు ఎదురుచూడటంలోనూ మీకు ఆనందం ఉంటుంది.
వారానికో/నెలకో బయటకు వెళ్ళండి
ఎప్పుడు ఒకే చోటు, ఒకో ప్రాంతంలో ఉండటం వలన మీకు, మీ పిల్లలకు చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకని వారానికి ఒకసారి సినిమాకు వెళ్లడం లేదా నెలకు ఒకసారి అయినా కొత్త ప్రదేశాలకు వెళ్తుండటం వలన అందరూ ఉల్లాసంగా ఉంటారు. ఇలా చేయడం వలన భార్యభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.
ఓపెన్ గా చెప్పండి
మీ భర్తకు తెలియకుండా ఏదైనా తప్పు చేసినా, మీరు ఏదైనా తప్పు చేసినా సరే ఓపెన్ గా వెంటనే చెప్పేయండి. దాంపత్య జీవితంలో ఏ విషయాలను మనసులోనే దాచుకుని బాధపడటం వలన ఆ సమస్య పెద్దదవుతుంది కానీ తగ్గిపోదు. అందుకని ఏదైనా వెంటనే చెప్పాలి. మీరు తప్పు చేసినా ఎటువంటి గర్వం లేకుండా క్షమించమని అడగండి.
మీ ఆయనకు సహాయం చేయండి
మీ భర్త కొన్నిసార్లు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేరు. వీలైతే మీరు ఆ సమస్యను తెలుసుకుని అండగా నిలబడండి. ఆర్ధిక సహాయమే అవసరం లేదు, మీరు ధైర్యంగా చెప్పే మాటలే మీ ఆయనకు మంచి ఆయుధాలుగా పనిచేస్తాయి.
పిల్లల బాధ్యత
పిల్లల బాధ్యత అనేది తల్లితండ్రుల ఇద్దరి మీదా ఆధారపడి ఉంటుంది. పిల్లలు నిద్రపోయే సమయానికి మీ ఆయన ఆఫీస్ నుండి రావడం వలన తండ్రిని చాలా మిస్ అవుతుంటారు. అందుకని మీ ఆయనను త్వరగా వచ్చేలా ప్లాన్ చేసుకోమని చెప్పాలి, ఎన్ని సమస్యలు ఉన్నా మీరు చేసేది మీ పిల్లల కోసమే కదా…ఏమంటారు పేరెంట్స్.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, అందరికీ ఉపయోగపడే విషయం అని మీకు అనిపిస్తే వెంటనే LIKE మరియు SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.