మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఈ 3 గుర్తులు కనిపిస్తే మీకు కవలలు పుడతారు

గర్భం దాల్చడం అనేది ఆ భగవంతుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. మీరు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు  మగబిడ్డ పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా అని చాలామంది చెప్పే ఉంటారు. అయితే మీకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అని తెలిపే గుర్తులు ఎలా ఉంటాయి?  ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

కవల పిల్లలు పుట్టడానికి కారణం

సాధారణంగా జన్యుపరమైన సంబధం వలన కవలలు జన్మిస్తారు అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందు మీ కుటుంబంలో అంటే రెండు అండాలు విడుదలయ్యే కుటుంబ చరిత్ర కలిగిన వారికి కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

కవలలు పుడతారు అని చెప్పే గుర్తులు:
అధిక బరువు పెరుగుతూ ఉండటం

సాధారణంగా ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు మాములు బరువు కలిగి ఉంటారు. అయితే కవల పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పడానికి రోజురోజుకీ అధిక బరువు పెరుగుతూ ఉండటం, గర్భం కూడా ఎక్కువ సైజులో ఉండటం జరుగుతుంది. కొందరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు బరువు తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగదు.

ఎక్కువ అలసట

ప్రెగ్నన్సీ సమయంలో సాధారణంగా అలసట ఉండటం సహజమే కానీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అలసట ఉంటుంది. ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా త్వరగా నీరసం వచ్చి అలసిపోతుంటారు. కానీ ఒక బిడ్డను మోసేవారు మరీ ఇంతగా అలసిపోరు. కొందరైతే బిడ్డ ప్రసవించేవరకు కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.

అతి వికారం

గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలు లేదా చివరి మూడు నెలలప్పుడు వికారం ఉండటం, ఉదయం లేవగానే వాంతులు

అవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ కవల పిల్లలు పుట్టబోయే లక్షణాలు ఉన్నపుడు మహిళలలో వికారం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలు ఇలా ఉంటుంది అనేది చెప్పలేరు. అలాగే కొందరికి అతి వికారం తక్కువగా నూ ఉంటుంది.

ఎక్కువ రక్తం అవసరం

ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు కంటే రెండు రెట్లు ఎక్కువగా రక్తం మీ శరీరంలో రక్తనాళాల నుండి ప్రసరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కువ రక్తం సరఫరా అయితేనే గర్భంలో ఉన్న మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీ శరీరం నుండి ఎక్కువ రక్తప్రసరణ జరుగుతున్నపుడు మోకాలి కింద వెనుక భాగంలో ఉండే నరాలు కొంచెం లావుగా, ఉబ్బినట్లుగా ఉంటాయి.

ఐరన్ లోపం మరియు రక్తహీనత

ఐరన్ లోపం మరియు రక్తహీనత లక్షణాలు మీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఎక్కువ రక్తసరఫరా ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. దీని వలన శ్వాసలో మార్పులు, అలసట, తలనొప్పి, హృదయ స్పందనలలో మార్పులు, మైకం కమ్మినట్లు ఉండటమే జరుగుతుంది. అందుకని మీలో ఈ లక్షణాలు ఐరన్ ఆహారం తక్కువైందని నిర్ధారించుకోవాలి.

ముఖ్య గమనిక :  ఈ లక్షణాలు మీరు గర్భంతో ఉన్నప్పుడు కనిపిస్తే కవలలు పుట్టబోతున్నట్లు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని మీకు అందించాలన్నదే మా ఉద్దేశం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ SHARE చేయండి.

ఇవి కూడా చదవండి. 

పిల్లలకు ఇష్టమైన మరియు ఆరోగ్యకరమైన 3 ఆహారాలు: తయారుచేసే విధానం

Leave a Reply

%d bloggers like this: