మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు అందరూ చెప్పే ఈ 5 మాటలను నమ్మకండి

ప్రతి మహిళ తన జీవితంలో అనుభవించే అద్భుతమైన దశ, ప్రెగ్నన్సీ. మాతృత్వం అనే భావన ఇంకేదీ పోటీ రాదూ. అయితే మీరు అమ్మ  అవ్వాలంటే,  మీరు ప్రెగ్నన్సీతో వున్నా 9 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న మీ ఆత్మీయులు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ చెపుతూనే ఉంటారు. వాటిలో ఎన్ని నిజాలు ఉంటాయో, మిమ్మల్ని భయపెట్టే అబద్ధాలు కూడా అన్నే ఉంటాయి. ప్రెగ్నన్సీ సమయంలో మీరు నమ్మకూడని ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి.

1. విమానంలో ప్రయాణం చేయకూడదు

ప్రెగ్నన్సీ తో వున్న వాళ్ళు విమానంలో ప్రయాణం చేయకూడదు అని చాలా మంది చెప్తుంటారు. కానిలో అందులో నిజం లేదు. మీరు ప్రెగ్నన్సీ సమయంలో బస్సు, ట్రైన్ లాంటి వాటిలో ఎలా ప్రయాణం చేస్తారో అలానే విమానంలో సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఎందులో అయినా ఎక్కువ సేపు ప్రయాణం ఉండకుండా చూసుకోండి.

2. ఇద్దరి కోసం తినాలి

ఈ మాట మీరు ప్రెగ్నన్సీ తో వున్నప్పుడు చాలా సార్లు వుని ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, రోజుకు 300-400 క్యాలోరిస్ అధికంగా తీసుకుంటే చాలు. ఎక్కువ తినడం కన్నా, మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉండేలా పూర్తి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.

3. కుడి వైపే నిద్రపోవాలి

ప్రెగ్నన్సీ సమయంలో కుడి వైపు నిద్ర పోవడం మంచిదే. కానీ మీకు ఇబ్బందిగా వున్నా సరే కుడి వైపే నిద్రపోవడానికి ప్రయత్నించకండి. మీకు ఏ వైపు సౌకర్యవంతంగా ఉంటే ఆ వైపు,( పొట్ట మీద తప్ప) నిద్రపోడానికి ప్రయత్నించండి. ప్రెగ్నన్సీ సమయం మీకు సరైన నిద్ర ఉండడం చాలా ముఖ్యం.

4. కాఫీ తాగితే కడుపు పోతుంది

ప్రెగ్నన్సీ సమయంలో కాఫీ అసలు తాగకూడదు అని అందరూ చెప్తారు. కానీ మీకు అలవాటు ఉంటే బలవంతంగా మానేయాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక చిన్న కప్పు కాఫీ తాగడం పెద్దగా సమస్యలు ఏమి కలింగించదు.

5. అందుకు దూరంగా..

ప్రెగ్నన్సీ సమయంలో భర్తతో కలవడం ప్రమాదం. ఇది అందురు సహజంగా అనుకుంటారు. కానీ కడుపు మీద ఎక్కువ వత్తిడి పడకుండా, ఏకాంతంగా పొల్గొనవచ్చు.  అది మీకు ఏ ఇబ్బంది లేకపోతేనే చేయండి. 

Leave a Reply

%d bloggers like this: